సంక్రాంతి ఫైట్: అఫీషియల్ డేట్ ఫిక్స్ చేసుకున్న బన్నీ, మహేష్

By Prashanth MFirst Published Oct 12, 2019, 9:19 PM IST
Highlights

అల్లు అర్జున్ వర్సెస్ మహేష్ బాబు సంక్రాంతి ఫైట్ కి డేట్ ఫిక్స్ అయ్యింది. నిన్నటివరకు ఈ ఫైట్ పై ఎన్నో రూమర్స్ వినిపించాయి. ఒకేరోజు రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడనున్నాయి.

అల్లు అర్జున్ వర్సెస్ మహేష్ బాబు సంక్రాంతి ఫైట్ కి డేట్ ఫిక్స్ అయ్యింది. నిన్నటివరకు ఈ ఫైట్ పై ఎన్నో రూమర్స్ వినిపించాయి. ఒకేరోజు రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడనున్నాయి. అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో రిలీజ్ డేట్ వచ్చిన కొన్ని నిమిషాలకే మహేష్ సరిలేరు నీకెవ్వరు రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.

టాలీవుడ్ లో ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ ఫైట్ ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సారి ఆ డోస్ మరింత పెరిగే అవకాశం ఉంది. అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో - మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు.. ఈ రెండు సినిమాలు దేనికవే ప్రత్యేకం. అయితే మహేష్ సినిమా కంటే రెండు రోజుల ముందే అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది.

కానీ ఇప్పుడు రెండు చిత్రాలు జనవరి 12న రిలీజ్ తేదీని ఫిక్స్ చేసుకున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బన్నీ ప్రాజెక్ట్ ను అల్లు అరవింద్ - చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరు కూడా బన్నీ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఆ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.    

click me!