విజయ నిర్మల గురించి మహేష్ ఎమోషనల్ కామెంట్స్.. అలా అనుకున్నాడట!

Published : Feb 20, 2020, 02:38 PM IST
విజయ నిర్మల గురించి మహేష్ ఎమోషనల్ కామెంట్స్.. అలా అనుకున్నాడట!

సారాంశం

ప్రముఖ నటి, దర్శకురాలు అయిన విజయ నిర్మల జయంతి సందర్భంగా నానక్ రాంగూడలో ఆమె కాంస్య విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రముఖ నటి, దర్శకురాలు అయిన విజయ నిర్మల జయంతి సందర్భంగా నానక్ రాంగూడలో ఆమె కాంస్య విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కృష్ణతో పాటు, మహేష్ బాబు, నరేష్, ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణం రాజు దంపతులు, హీరో సుధీర్ బాబు, పరుచూరి గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ విజయ నిర్మల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. విజయ నిర్మల గారు చాలా డైనమిక్ పర్సన్. నా సినిమాలు రిలీజైన ప్రతి సారి నాన్నగారు మొదట ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతారు. ఆ తర్వాత విజయ నిర్మల గారు మాట్లాడేవారు. 

సరిలేరు నీకెవ్వరు రిలీజైన తర్వాత కూడా నాన్న ఫోన్ చేశారు. ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతారేమోనని ఒక్క క్షణం పొరపాటు పడ్డాను. కానీ ప్రస్తుతం ఆవిడ లేరు కదా అని చాలా బాధపడ్డాను అని మహేష్ తెలిపాడు. విజయనిర్మల గారిని చాలా మిస్ అవుతున్నట్లు తెలిపాడు. 

ప్రతి ఏడాది విజయనిర్మల బర్త్ డే ఘనంగా నిర్వహించేవాళ్ళం. ఇప్పుడు కాంస్య విగ్రహావిష్కరణ ద్వారా ఆమెకు నివాళి అరిపిస్తునట్లు మహేష్ తెలిపాడు. సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక మహేష్ బాబు గిన్నిస్ రికార్డ్ ఫలకాన్ని ఆవిష్కరించాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?