అభిమానులు గర్వపడేలా 'సరిలేరు నీకెవ్వరు': మహేష్!

Published : Oct 13, 2019, 02:21 PM ISTUpdated : Oct 13, 2019, 02:28 PM IST
అభిమానులు గర్వపడేలా 'సరిలేరు నీకెవ్వరు': మహేష్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 

మహేష్ ఈ ఏడాది మహర్షి చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. అదే ఉత్సాహంతో ప్రస్తుతం ఆర్మీ మేజర్ గా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా మహేష్ బాబు నేడు విజయవాడలో పర్యటించాడు. 

ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ షోరూం ప్రారంభోత్సవానికి మహేష్ హాజరయ్యాడు. దీనితో మహేష్ ని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున ఎగబడ్డారు. మహేష్ బాబు వస్తుండడంతో పోలీసులు కూడా చేరుకొని భద్రత కల్పించారు. 

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. విజయవాడతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. విజయవాడలో తాను నటించిన ఎన్నో చిత్రాలు ఈవెంట్స్ జరిగాయని మహేష్ పేర్కొన్నాడు. 

ఈ సందర్భంగా మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్ర గురించి ప్రస్తావించాడు. నా కొత్త చిత్రం సంక్రాంతికి విడుదుల కాబోతోంది. సరిలేరు నీకెవ్వరు అభిమానులు గర్వపడేలా ఉంటుందని మహేష్ ప్రస్తావించాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?