సినీ కార్మికులకు సూపర్‌ స్టార్‌ సాయం

By Satish ReddyFirst Published Mar 28, 2020, 3:23 PM IST
Highlights

సూపర్‌ స్టార్ మహేష్ బాబు సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. తన వంతుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్కర్స్‌ సహాయార్థం 25 లక్షల విరాళం ప్రకటించాడు. అంతేకాదు ఇండస్ట్రీలోని ఇతర నటీనటులు కూడా కార్మికులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు మహేష్.

కరోనా మహమ్మారీ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ ప్రభావంతో అన్ని రంగాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా రోజువారి కార్మికలు జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. దీంతో ఆ వర్గాలను ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా రోజు వారీ వేతనాల మీద బతికే సినీ కార్మికులను ఆదుకునేందుకు టాప్ స్టార్లు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్‌ లాంటి వారు సినీ కార్మికుల కోసం విరాళాలు ప్రకటించారు.

తాజాగా సూపర్‌ స్టార్ మహేష్ బాబు కూడా సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. తన వంతుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్కర్స్‌ సహాయార్థం 25 లక్షల విరాళం ప్రకటించాడు. అంతేకాదు ఇండస్ట్రీలోని ఇతర నటీనటులు కూడా కార్మికులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు మహేష్. సూపర్‌ స్టార్ పిలుపుతో ఇంకెంత మంది ముందుకు వస్తారో చూడాలి.

ఇప్పటికే కరోనా పై పోరాటానికి తనవంతు సాయంగా మహేష్ కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్‌ హిట్ అందుకున్న సూపర్‌ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. ముందుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని ప్రకటించినా ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు మహేష్.

The lockdown situation adversely impacts the lives of daily wage cine workers. Will be contributing Rs. 25 lakhs towards Corona crisis charity for TFI workers. Requesting all fellow actors to come forward and make their contributions in these testing times 🙏🙏

— Mahesh Babu (@urstrulyMahesh)
click me!