థమన్ బుట్టలో మహేష్.. దేవికి మరో దెబ్బ?

prashanth musti   | Asianet News
Published : Jan 20, 2020, 11:05 AM ISTUpdated : Jan 20, 2020, 11:09 AM IST
థమన్ బుట్టలో మహేష్.. దేవికి మరో దెబ్బ?

సారాంశం

వరుసగా అవకాశాలు అందుకోవడమే కాకుండా పాటలతో సినిమాలకు మంచి హైప్ క్రియేట్ చేయగల సంగీత దర్శకుడు థమన్. మొన్నటివరకు దేవి శ్రీ ప్రసాద్ తన పాటలతో ఇండస్ట్రీని డామినేట్ చేశాడు. ఇక ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లోకి థమన్ వచ్చి చేరాడు.

టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకోవడమే కాకుండా పాటలతో సినిమాలకు మంచి హైప్ క్రియేట్ చేయగల సంగీత దర్శకుడు థమన్. మొన్నటివరకు దేవి శ్రీ ప్రసాద్ తన పాటలతో ఇండస్ట్రీని డామినేట్ చేశాడు. ఇక ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లోకి థమన్ వచ్చి చేరాడు. 'అల వైకుంఠపురములో' సాంగ్స్ క్లిక్కవ్వడంత అందరి హీరోల కన్ను థమన్ పై పడింది.

ఇక ఫైనల్ గా థమన్ బుట్టలో మహేష్ పడినట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ చేయవల్సిన సినిమాని థమన్ చేయబోతున్నట్లు టాక్ వస్తోంది. మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాని వంశీ పైడిపల్లితో చేయబోతున్న విషయం తెలిసిందే. మహర్షి సినిమా సక్సెస్ కావడంతో నెక్స్ట్ సినిమా కూడా అదే కాంబినేషన్ లో చేయాలనీ మహేష్ అనుకున్నాడు. మొదటి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా ఎలాంటి మార్పులు చేయకూడదని మహర్షి సినిమాకు సంగీతం అందించిన దేవినే అనుకున్నారు.

కానీ ప్రస్తుతం మహేష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటె దేవి శ్రీ ప్రసాద్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు అందించిన మ్యూజిక్ ఏ మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దేవి సక్సెస్ కాలేకపోయాడు. అయితే థమన్ మాత్రం కేవలం తన పాటలతోనే అల వైకుంఠపురములో సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశాడు. దీంతో నెక్స్ట్ సినిమాకు థమన్ ని సెలెక్ట్ చేసుకోవాలని మహేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ లో మహేష్ తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?