మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన రితేష్ దేశ్ ముఖ్, జెనిలియా!

By AN TeluguFirst Published Oct 21, 2019, 11:07 AM IST
Highlights

హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 
51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 

సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం పోలింగ్ మొదలైంది.  మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 3,237 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో 235మంది మహిళలు ఉన్నారు.

మరోవైపు హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 

టిక్ టాక్ స్టార్ సోనాలీ ఓటు హక్కు వినియోగించుకున్నారు!

ఈ ఎన్నికల్లో సినీ నటుడు రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా తమ ఓటు హక్కుని  వినియోగించుకున్నారు. వీరితో పాటు మిగిలిన కుటుంబసభ్యులు కూడా లతూర్ పోలింగ్ బూత్ లో ఓటేశారు. రితేష్ సోదరులు అమిత్ దేశ్ ముఖ్, ధీరజ్ దేశ్ ముఖ్ లు లతూర్ సిటీ, లతూర్ రూరల్ నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ కూడా చేస్తున్నారు.

పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికల  ఫలితాలు ఈ నెల 24వ తేదీన వెలువడనున్నాయి. ఏ పార్టీ గెలుపు జెండా ఎగురవేస్తుందో తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉండగా.. ప్రధాని మోదీ  ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

: Ritesh Deshmukh, his wife Genelia D'Souza & family cast their votes at a polling booth in Latur. His brothers Amit Deshmukh & Dhiraj Deshmukh are contesting polls as Congress candidates from Latur city & Latur rural constituencies, respectively. pic.twitter.com/U9zA9ozZwp

— ANI (@ANI)
click me!