భర్త మహేష్ భూపతితో కలిసి ఓటేసిన సినీ నటి లారా దత్తా!

By AN TeluguFirst Published Oct 21, 2019, 11:40 AM IST
Highlights

హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 
51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 

సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం పోలింగ్ మొదలైంది.  మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 3,237 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో 235మంది మహిళలు ఉన్నారు.

మరోవైపు హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 

బాంద్రాలో ఓటేసిన అందాల తార మాధురి దీక్షిత్!

ఈ ఎన్నికల్లో సినీ నటి లారా దత్తా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ముంబైలో బాంద్రా పోలింగ్ బూత్ లో తన భర్త, మాజీ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతితో కలిసి ఓటేశారు. పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6గంటల వరకు జరగనుంది.

ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 24వ తేదీన వెలువడనున్నాయి. ఏ పార్టీ గెలుపు జెండా ఎగురవేస్తుందో తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉండగా.. ప్రధాని మోదీ  ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

 

Mumbai: Former tennis player Mahesh Bhupati, wife and actor Lara Dutta after casting their vote at a polling booth in Bandra(West) pic.twitter.com/IFy8jc5MNS

— ANI (@ANI)
click me!
Last Updated Oct 21, 2019, 11:40 AM IST
click me!