పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్‌

Published : Apr 06, 2020, 12:43 PM ISTUpdated : Apr 06, 2020, 12:45 PM IST
పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్‌

సారాంశం

తన పెళ్లి విషయంలో వస్తున్న రూమర్స్‌పై మహానటి కీర్తి సురేష్‌ స్పందించింది. త్వరలో తాను పెళ్లి చేసుకోతున్నట్టుగా వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. కెరీర్‌ పరంగా ఫుల్ బిజీగా ఉన్న తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపింది.

కొద్ది రోజులుగా కీర్తి సురేష్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతుందన్న వార్త ఫిలిం సర్కిల్స్‌లో వైరల్‌ అవుతోంది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడిని కీర్తి పెళ్లాడబోతుందన్న వార్త మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ స్పందించింది. ఈ వార్తలు మీడియాలో చూసి నవ్వుకున్నాం అన్న కీర్తి ప్రస్తుతం తను కెరీర్‌ పరంగా చాలా బిజీగా ఉన్నానని ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని క్లారిటీ ఇచ్చింది.

స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సౌత్‌ బ్యూటీ కీర్తి సురేష్. మలయాళ సినిమాలతో మొదలు పెట్టి టాలీవుడ్‌ కోలీవుడ్‌ లలో స్టార్ ఇమేజ్ అందుకుంది ఆ బ్యూటీ. మాతృభాష మలయాళమే అయినా తెలుగు తమిళ భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది కీర్తి. 2016లో రిలీజ్ అయిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కీర్తి సురేష్ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తున్నా గ్లామర్ షోకు మాత్రం నో చెప్పింది కీర్తి.

Also Read: బయోపిక్‌లో సమంత.. ఫెమినిస్ట్ పాత్రలో నట విశ్వరూపం

2018లో రిలీజ్‌ అయిన మహానటి సినిమా కీర్తి ఇమేజ్‌ను ఓ రేంజ్‌ తీసుకెళ్లింది. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు నాగ అశ్విన్ దర్శకుడు. ఈ సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేష్‌ను జాతీయ అవార్డ్ సైతం వరించింది. ఈ సినిమాతో ఆమె సౌత్‌ టాప్‌ స్టార్స్‌ లిస్ట్‌ లో చేరిపోయింది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉంది. కీర్తి నటిస్తున్న రెండు తెలుగు, రెండు తమిళ, ఒక మలయాళ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?