మహేష్ బాబు 'మహర్షి'.. బుల్లితెరపై ఫ్లాప్ షో!

By AN TeluguFirst Published Oct 18, 2019, 10:41 AM IST
Highlights

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన 'మహర్షి' సినిమాకి కేవలం 8.42 టీఆర్పీ మాత్రమే వచ్చింది. భారీ పోటీ మధ్య 'మహర్షి' శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది జెమినీ టీవీ. 

స్టార్ హీరోల సినిమాలు మొదటిసారి టీవీల్లో ప్రసారం చేసేప్పుడు రేటింగ్స్ ఓ రేంజ్ లో వస్తుంటాయి. 'రంగస్థలం' సినిమాకి 19.5, 'జనతా గ్యారేజ్' సినిమాకి 20.69, డీజే సినిమాకి 21.7 రేటింగ్స్ వచ్చాయి. భారీ సినిమాలకు టీఆర్పీ రేటింగ్స్ అంటే ఇలా ఉంటాయి. కానీ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా మాత్రం జెమినీ టీవీతో పాటు అందరికీ షాక్ ఇచ్చింది.

దీనికి కారణం ఏంటంటే.. ఈ సినిమాకి టీవీల్లో అతి తక్కువ రేటింగ్ రావడమే.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన 'మహర్షి' సినిమాకి కేవలం 8.42 టీఆర్పీ  మాత్రమే వచ్చింది. భారీ పోటీ మధ్య 'మహర్షి' శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది జెమినీ టీవీ. సినిమాకి ప్రమోషన్ కూడా బాగానే చేసుకుంది. సరైన సమయం చూసి టీవీలో సినిమాను ప్రచారం చేశారు. కానీ 'మహర్షి'ని బుల్లితెరపై వీక్షించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు.

మరీ ముఖ్యంగా ఇతర ఛానెల్స్ లో పెద్దగాపోటీనిచ్చే సినిమాలు లేకపోయినా.. 'మహర్షి'కి రేటింగ్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహేష్ నటించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో పెట్టి చాలా కాలమైంది. ఆ ప్రభావం శాటిలైట్ ఎయిరింగ్ పై బాగా పడిందని భావిస్తున్నారు విశ్లేషకులు. అయితే ఫిదా, గీత గోవిందం వంటి సినిమాలు ప్రైమ్ లో వచ్చిన చాలా కాలానికే టీవీలో ప్రసారమయ్యాయి.

వాటికి మాత్రం మంచి రేటింగ్స్ వచ్చాయి. ఆ సినిమాలపై జనాలకు ఆసక్తి తగ్గలేదని.. 'మహర్షి' విషయంలో మాత్రం ప్రేక్షకులు ఇంటరెస్ట్ చూపించలేదని అంటున్నారు. 'మహర్షి' టీవీలో ప్రసారం చేసిన సమయంలోనే సమంత నటించిన 'ఓ బేబీ' కూడా ప్రసారం చేశారు. కానీ మహష్ సినిమా ముందు అది నిలవలేదనిఅనుకున్నారు. కానీ 'ఓ బేబీ'కి 6.12 రేటింగ్ వచ్చింది. అంటే మహేష్ సినిమాకి ఒకరకంగా సమంత పోటీ ఇచ్చిందనే చెప్పాలి. కారణాలు ఏవైనా.. మహేష్ సినిమా బుల్లితెరపై ఓ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది.  

click me!