లవ్ అఫైర్: కన్నడ అందాల తార చందన ఆత్మహత్య

Published : Jun 02, 2020, 07:12 AM ISTUpdated : Jun 02, 2020, 07:13 AM IST
లవ్ అఫైర్: కన్నడ అందాల తార చందన ఆత్మహత్య

సారాంశం

కన్నడ అందాల తార చందన ఆత్మహత్య చేసుకున్నారు. గత నెల 28వ తేదీన ఆమె ఆత్మహత్య చేసుకోగా జూన్ 1వ తేదీన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు.

బెంగళూరు: కన్నడ చిత్రసీమలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంంది. 29 ఏళ్ల సినీ నటి చందన ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని తన నివాసంలో విషం తీసుకుని ఆమె మరణించింది. ఈ సంఘటన మే 28వ తేదీన జరిగినప్పటికీ జూన్ 1వ తేదీన వెలుగులోకి వచ్చింది. 

చందన తన ఫోన్ లో వీడియో రికార్డు చేసింది. డెత్ నోట్ కూడా రాసింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు మోసం చేశాడని వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. 

కర్ణాటకలోని హసన్ జిల్లా బెలూరుకు చెందిన చందన దినేష్ అనే వ్యక్తితో సంబంధాలు కొనసాగిస్తోంది. గత కొన్నేళ్లుగా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే, అతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో చందన ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. 

దినేష్ కు అమ్మాయిలను మోసం చేసే అలవాటు ఉందని, దాంతో అతనితో పెళ్లిని చందన కుటుంబ సభ్యులు అంగీకరించలేదని కుటుంబ సభ్యులంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?