బిగ్ బాస్ 4: మెగాస్టార్ VS జూనియర్ ఎన్టీఆర్..?

Published : Dec 05, 2019, 02:07 PM ISTUpdated : Dec 05, 2019, 02:15 PM IST
బిగ్ బాస్ 4: మెగాస్టార్ VS జూనియర్ ఎన్టీఆర్..?

సారాంశం

ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన బిగ్ బాస్ షో నెక్స్ట్ సీజన్ కి మరింత హైప్ క్రియేట్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటోంది. గడిచిన మూడు సీజన్లు విజయవంతగా ముగిశాయి. మంచి రేటింగ్స్ తో స్టార్ హీరోలు వారి సత్తా చాటారు. అయితే నాని - నాగార్జున కంటే హై రేంజ్ లో జూనియర్ ఎన్టీఆర్ మొదటి సీజన్ ని గ్రాండ్ గా ఓపెన్ చేశాడు.

తెలుగు బుల్లి తెరపై ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన బిగ్ బాస్ షో నెక్స్ట్ సీజన్ కి మరింత హైప్ క్రియేట్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటోంది. గడిచిన మూడు సీజన్లు విజయవంతగా ముగిశాయి. మంచి రేటింగ్స్ తో స్టార్ హీరోలు వారి సత్తా చాటారు. అయితే నాని - నాగార్జున కంటే హై రేంజ్ లో జూనియర్ ఎన్టీఆర్ మొదటి సీజన్ ని గ్రాండ్ గా ఓపెన్ చేశాడు.

ఇకపోతే నెక్స్ట్ సీజన్ కి ఎవరిని ఫిక్స్ చేస్తారు అనే ప్రశ్న అందరిలో ఆసక్తిని రేపుతోంది. బిగ్ బాస్ 3 ముగియగానే మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సీజన్ కి హోస్ట్ చేయబోతున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ నిర్వాహకులు తారక్ వైపే ముగ్గు చుపుతున్నట్లు సమాచారం. అసలైతే మూడవ సీజన్ ని తారక్ తోనే చేయించాలని అనుకున్నారు.

కానీ RRR సినిమాతో బిజీగా ఉండడం వల్ల అది కుదరలేదు.  దీంతో నెక్స్ట్ సీజన్ కి అయినా రాప్పించాలని ఇప్పటి నుంచే ప్లానింగ్స్ జరుగుతున్నాయట. నెక్స్ట్ సీజన్ కి తారక్ గనక ఒప్పుకుంటే డబుల్ పేమెంట్ ఇవ్వాలని కూడా నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మరి వారి ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న RRR సినిమా నెక్స్ట్ ఇయర్ జులైలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 400కోట్ల భారీ బడ్జెట్ తో డివివి.దానయ్య నిర్మిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?