పవన్ కళ్యాణ్ కథతో ప్రభాస్.. డైరెక్టర్ క్రిష్ ప్లాన్ ఇదే!

Published : Oct 16, 2019, 03:09 PM ISTUpdated : Oct 16, 2019, 04:05 PM IST
పవన్ కళ్యాణ్ కథతో ప్రభాస్.. డైరెక్టర్ క్రిష్ ప్లాన్ ఇదే!

సారాంశం

జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ వెండితెరపై కనిపించలేదు. కానీ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలని జనసేన పార్టీ వర్గాలు ఖండిస్తూ వస్తున్నాయి. అయినా కూడా ఈ వార్తలు ఆగడం లేదు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా డైరెక్ర్ట్ క్రిష్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

క్రిష్ ఏకంగా చిరంజీవిని సైతం కలసి పవన్ కళ్యాణ్ ని సినిమాకు ఒప్పించాల్సిందిగా కోరినట్లు మీడియా వార్తలు వచ్చాయి. రీసెంట్ గా క్రిష్ పవన్ ని సైతం కలసి కథ వినిపించారట. కథ అద్భుతంగా ఉన్నట్లు పవన్ కితాబిచ్చినట్లు తెలుస్తోంది. కానీ తాను సినిమా చేస్తానని మాత్రం హామీ ఇవ్వలేనని పవన్ క్రిష్ తో అన్నట్లు సమాచారం. 

పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఓకె అంటే సినిమా నిర్మించేందుకు మైత్రి మూవీస్, హారిక అండ్ హాసిని లాంటి సంస్థలు రెడీగా ఉన్నాయి. ఒక వేళ ఈ చిత్రం పవన్ చేయకుంటే ప్రభాస్ ని సంప్రదించాలని కూడా క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాహో తర్వాత క్రిష్ ప్రభాస్ తో టచ్ లో ఉన్నాడు.  

క్రిష్ చివరగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో ఏ సారి తన కొంత కథతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని క్రిష్ భావిస్తున్నాడు. పవన్ ఓకే చెబితే మాత్రం ఇది క్రేజీ కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?