PSPK27: పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్న పవన్

prashanth musti   | Asianet News
Published : Feb 15, 2020, 04:26 PM IST
PSPK27: పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్న పవన్

సారాంశం

పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ఒకే చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఒకదానికోటి సంబంధం లేకుండా ఉన్నాయి. 5 సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ షూటింగ్ షెడ్యూల్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ఒకే చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఒకదానికోటి సంబంధం లేకుండా ఉన్నాయి. 5 సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ షూటింగ్ షెడ్యూల్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.

మొదట వకీల్ సాబ్ అంటూ పింక్ రీమేక్ తో రాబోతున్నాడు. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ సినిమా చేయబోతున్నాడు.  పింక్ రీమేక్ లో పవన్ కి సంబందించిన షూటింగ్ పనులు దాదాపు ముగిసినట్లే అనిపిస్తోంది. ఇక క్రిష్ ప్రాజెక్ట్ పై పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టనున్నాడు. పవన్ కోసం చిత్ర యూనిట్ ఫస్ట్ షెడ్యూల్ ని పక్కా ప్లాన్ తో రెడీ చేసినట్లు తెలుస్తోంది. పవన్ పాత్రకు సంబందించిన పాత్ర పై ఎక్కువగా షూటింగ్ నిర్వహించనున్నారట.

నెక్స్ట్ వీక్ మంగళవారం నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.   తెలిసిందే. అనంతరం హరీష్ శంకర్ తో పాటు మరో ఇద్దరు దర్శకుల కథలను కూడా లాక్ చేసి ఉంచారని తెలుస్తోంది. కథకు తగ్గట్టుగా 'విరూపాక్షి' అనే టైటిల్ ని సెట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. తెలుగు వాళ్లకి తెలియని ఒక తెలంగాణ రాబిన్ హుడ్ కథను పవన్ ఈ సినిమా ద్వారా తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?