మరో స్టార్ హీరోతో శంకర్ న్యూ మూవీ..!

Published : Dec 09, 2019, 01:37 PM ISTUpdated : Dec 09, 2019, 02:01 PM IST
మరో స్టార్ హీరోతో శంకర్ న్యూ మూవీ..!

సారాంశం

శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ ఇటీవల కాలంలో ఒక సినిమా సెట్స్ అపి ఉండగానే మరో ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తెస్తున్నాడు. 

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ ఇటీవల కాలంలో ఒక సినిమా సెట్స్ అపి ఉండగానే మరో ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తెస్తున్నాడు. షూటింగ్ పూర్తయ్యేలోపు మరో హీరోను లైన్ లో పెడుతున్నాడు.

ఇక నెక్స్ట్ ఆయన కన్ను ఇలయథలపతి విజయ్ పడినట్లు తెలుస్తోంది.  గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక భారీ యాక్షన్ సినిమాని విజయ్ తో శంకర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఒక అవార్డ్స్ వేడుకలో నెక్స్ట్ విజయ్ తో సినిమా చేయనున్నట్లు శంకర్ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆ సినిమా ఎలా ఉండబోతోంది అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇటీవల బిగిల్ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై మరింత జాగ్రతలు తీసుకుంటున్నాడు. కథ నచ్చితే ఎలాంటి డైరెక్టర్ అయినా వెంటనే ఒప్పేసుకుంటున్నాడు.

ఇక శంకర్ లాంటి దర్శకుడు చెబితే విజయ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడని చెప్పవచ్చు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన స్నేహితుడు సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. 3 ఇడియట్స్ కి ఆ సినిమా రీమేక్ గా వచ్చింది. మరి ఇప్పుడు శంకర్ విజయ్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?