జయ బయోపిక్.. కంగనా స్పెషల్ లుక్!

prashanth musti   | Asianet News
Published : Feb 03, 2020, 08:43 AM ISTUpdated : Feb 03, 2020, 08:44 AM IST
జయ బయోపిక్.. కంగనా స్పెషల్ లుక్!

సారాంశం

బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక మార్కెట్ సంపాదించుకున్న అతికొద్ది  నటీమణి కంగనా రనౌత్ ఒకరు. స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువకాకుండా 100కోట్ల బిజినెస్ తో ముందుకు కొనసాగే సత్తా ఉన్న ఏకైక లేడి సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు జయలలిత బయోపిక్ తో స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది.

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక మార్కెట్ సంపాదించుకున్న అతికొద్ది  నటీమణి కంగనా రనౌత్ ఒకరు. స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువకాకుండా 100కోట్ల బిజినెస్ తో ముందుకు కొనసాగే సత్తా ఉన్న ఏకైక లేడి సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు జయలలిత బయోపిక్ తో స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది.

త్వరలోనే ఆ సినిమా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ సాంగ్ కోసం అమ్మడు ఎప్పుడు లేని విధంగా క్లాసికల్ డ్యాన్స్ పై ద్రుష్టి పెట్టింది. ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసిన ఒక ఫోటో చూస్తే ఆమె పట్టుదలపై మరొక క్లారిటీ రాకుండా ఉండదు. ఆ ఫొటోలో అద్భుతమైన కళ దాగి ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.  స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేలా దాదాపు 100 మంది నృత్య కళాకారులతో భరతనాట్యంకి సంబందించిన సాంగ్ ని కంపోజ్ చేశారట.

ఆ సాంగ్ కోసం గత కొన్ని రోజులుగా కంగనా భరతనాట్యం క్లాసులకు వెళ్లి డ్యాన్స్ నేర్చుకుంది.  జయలలిత పాత సినిమాలకు సంబందించిన డ్యాన్సులపై అలాగే నటనపై చిత్ర యూనిట్ అనేక వర్క్ షాప్ నిర్వహించింది. అందులో కూడా కంగనా గ్యాప్ లేకుండా పాల్గొంటూ ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుందట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగు తమిళ్ హిందీ భాషల్లో దర్శకుడు ఏఎల్.విజయ్ తెరకెక్కించనున్నాడు. బాహుబలి రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమకు రచయితగా వర్క్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?