'ఇండియన్ 2' యాక్సిడెంట్.. స్పందించిన కమల్ హాసన్!

prashanth musti   | Asianet News
Published : Feb 20, 2020, 08:41 AM ISTUpdated : Feb 20, 2020, 08:47 AM IST
'ఇండియన్ 2' యాక్సిడెంట్.. స్పందించిన కమల్ హాసన్!

సారాంశం

రతీయుడు 2 షూటింగ్ లో నిన్న రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చెన్నై లో జరిగిన ఘటనలో ఇద్దరు సహాయక దర్శకులు, మరొక స్టాఫ్ మెంబర్ అక్కడిక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలతో చిక్కిత్స పొందుతూన్నారు. భారీ క్రేయిన్ అనుకోకుండా విరిగిపడటంతో ప్రమాదం జరిగింది. అయితే ఘటనపై కథానాయకుడు కమల్ హాసన్ స్పందించారు.

శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 షూటింగ్ లో నిన్న రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చెన్నై లో జరిగిన ఘటనలో ఇద్దరు సహాయక దర్శకులు, మరొక స్టాఫ్ మెంబర్ అక్కడిక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలతో చిక్కిత్స పొందుతూన్నారు.

భారీ క్రేయిన్ అనుకోకుండా విరిగిపడటంతో ప్రమాదం జరిగింది. అయితే ఘటనపై కథానాయకుడు కమల్ హాసన్ స్పందించారు. "ఈ ఘటన అత్యంత బయంకరమైంది. నా తోటి మిత్రులను కొలీగ్స్ ని కోల్పోవడం చాలా బాధను కలిగిస్తోంది. మరణించిన వారి కుటుంబ సబ్యులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం గాయపడిన వారికి చిక్కిత్స అందుతోంది".

వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు కమల్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.   ఇకపోతే డైరెక్టర్ శంకర్ కి కూడా ఘటన లో పలు గాయాలయినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా శంకర్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న మధు(29), కృష్ణ(34) తీవ్ర గాయాలతో షూటింగ్ స్పాట్ లోనే మరణించడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇక స్టాపర్ గా ఉన్న 60 ఏళ్ల చంద్రన్...కూడా ఘటనలో మృతి చెందారు. ప్రస్తుతం కోలీవుడ్ లోనే కాకుండా దేశమంతా ఈ యాక్సిడెంట్ అందరిని షాక్ కి గురి చేసింది. ఘటన సమయంలో కమల్ హాసన్ షూటింగ్ స్పాట్ కి కొద్దీ దూరంలో ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?