'ఎంత మంచివాడవురా' టీజర్ : మంచోడే కానీ..!

Published : Oct 09, 2019, 12:15 PM ISTUpdated : Oct 09, 2019, 12:17 PM IST
'ఎంత మంచివాడవురా' టీజర్ : మంచోడే కానీ..!

సారాంశం

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 'ఎంత మంచివాడవురా' అనే సినిమాలో నటిస్తున్నాడు. సతీష్ వేగ్నేస డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇటీవల '118' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 'ఎంత మంచివాడవురా' అనే సినిమాలో నటిస్తున్నాడు. సతీష్ వేగ్నేస డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

''మా మనవడు శివ మంచోళ్లకే మంచివాడు. నా కొడుకు ఆచార్య చాలా మంచివాడు. మా అల్లుడు బాలు చాలా మంచోడు. నా తమ్ముడు సూర్య ఎంత మంచోడో. నా అన్నయ్య రిషి చాలా మంచోడు. నా హీరో బాలు చాలా మంచోడు'' ఇలా కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. మరోపక్క కళ్యాణ్ రామ్ రౌడీలను కొడుతూ కనిపిస్తాడు.

‘అందరూ మంచోడు అంటుంటే నువ్వు ఇలా కొడుతున్నావేంట్రా’ అని ఓ రౌడీ కల్యాణ్ రామ్‌ను ప్రశ్నించగా.. ‘రాముడు కూడా మంచోడే. రావణాసురుడిని చంపలా’ అని చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ కాస్త కొత్తగా కనిపిస్తోంది.

టీజర్ చివరిలో డైలాగ్ ద్వారాసినిమా సంక్రాంతికి రాబోతుందని చెప్పారు. మెహ్రీన్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?