మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం.. కళ్యాణ్ రామ్ కామెంట్స్

Published : Jun 10, 2020, 08:44 AM ISTUpdated : Jun 10, 2020, 08:50 AM IST
మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం.. కళ్యాణ్ రామ్ కామెంట్స్

సారాంశం

కళ్యాణ్ రామ్ కూడా.. సోషల్ మీడియా వేదికగా.. బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

నందమూరి నటసింహం బాలకృష్ణ నేడు 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. కాగా... వీరి జాబితాలో కళ్యాణ్ రామ్ కూడా చేరిపోయాడు.

కళ్యాణ్ రామ్ కూడా.. సోషల్ మీడియా వేదికగా.. బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే  సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai ’’ అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. కాగా.. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

 

ఇదిలా ఉండగా.. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా మంగళవారమే అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. బోయపాటి  దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా.. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. అందులో బాలయ్య లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?