కాస్ట్లీ ఐటెం సాంగ్ లో కాజల్ అగర్వాల్.. స్టార్ హీరోతో కలసి రెచ్చిపోతుందట?

Published : Dec 15, 2019, 01:15 PM IST
కాస్ట్లీ ఐటెం సాంగ్ లో కాజల్ అగర్వాల్.. స్టార్ హీరోతో కలసి రెచ్చిపోతుందట?

సారాంశం

అందాల చందమామ కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దకాలానికి పైగా కాజల్ సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తోంది. ఇటీవల కుర్ర హీరోయిన్ల జోరుతో కాజల్ రేసులో కాస్త వెనుకబడిన మాట వాస్తవమే.

అందాల చందమామ కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దకాలానికి పైగా కాజల్ సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తోంది. ఇటీవల కుర్ర హీరోయిన్ల జోరుతో కాజల్ రేసులో కాస్త వెనుకబడిన మాట వాస్తవమే. కానీ కాజల్ ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ సరసన శంకర్ దర్శత్వంలో ఇండియన్ 2లో కాజల్ నటిస్తోంది. 

కాజల్ అగర్వాల్ తన కెరీర్ ఇంతవరకు హద్దులు దాటే విధంగా గ్లామర్ షో చేయలేదు. కానీ ఇటీవల కాజల్ అగర్వాల్ సిల్వర్ స్క్రీన్ పై అందాలు ఆరబోసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్ లో అందాలు ఆరబోసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో చిత్రంలో భారీ ఖర్చుతో అదిరిపోయే ఐటెం సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. త్వరలో ఆ సాంగ్ ని షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం అల్లుఆ అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాజల్ అగర్వాల్ తో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. 

గతంలో కాజల్ అగర్వాల్ జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఐటెం సాంగ్ చేసింది. ఆ సాంగ్ లో కాజల్ అగర్వాల్ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. అల వైకుంఠపురములో చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కూడా డాన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?