సైరా ఎఫెక్ట్: సురేందర్ రెడ్డికి గ్రేట్ డైరెక్టర్ కెవి రెడ్డి అవార్డు!

By tirumala ANFirst Published Oct 14, 2019, 5:09 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రానికి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద కూడా సైరా చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నిర్మాతగా రాంచరణ్, దర్శకుడిగా సురేందర్ రెడ్డి 100 శాతం విజయం సాధించారు. 

తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రాన్ని తెరకెక్కించారు. నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ జీవించారు. తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. సైరా చిత్రానికి అనేక అవార్డులు దాసోహం కావడం ఖాయం అనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

అందుకు తగ్గట్లుగానే దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ అవార్డుని అందుకోనున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గ్రేట్ డైరెక్టర్ కెవి రెడ్డి పేరిట ప్రతి ఏడాది ప్రధానం చేసే అవార్డుకు సురేందర్ రెడ్డి ఎంపికయ్యారు. 

ఈ అవార్డు ప్రధానోత్సవం మంగళవారం రోజు హైదరాబాద్ లో జరగనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా ఈ అవార్డు ఉండబోతోంది. ఈ అవార్డు ప్రదానోత్సవానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. 

అతిథిగా హాజరు కాబోతున్న కె రాఘవేంద్ర రావు చేతుల మీదుగా సురేందర్ రెడ్డి కెవి రెడ్డి అవార్డుని అందుకోనున్నారు. మురళి మోహన్, తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, సిరివెన్నెల, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 

చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ సైరా చిత్రాన్ని 250 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. సురేందర్ రెడ్డి సైరా చిత్రం కోసం తీర్చిదిద్దిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. 

click me!