పవన్ 'బ్రో' కు ‘ప్రాజెక్ట్ కే’ఆ విషయంలో పోలిక?

Published : Jul 10, 2023, 11:56 AM IST
పవన్ 'బ్రో' కు  ‘ప్రాజెక్ట్ కే’ఆ విషయంలో పోలిక?

సారాంశం

ఆ తర్వాత ‘కామిక్ కాన్’ నుంచి ఆహ్వానం అందుకోవడం.. అలాగే సినిమాకు సంబంధించి మెర్చండైజ్ అమ్మకాలతో సోషల్ మీడియాలో ‘ప్రాజెక్ట్-కే’ ట్రెండ్ అవుతూ వస్తోంది. 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌లు మొదటిసారి నటిస్తున్న సినిమా ‘బ్రో’. తమిళ దర్శకుడు పి.సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జులై 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రం ప్రమోషన్ లో కాలం చేసే ఇంద్రజాలం నేపథ్యంలో సాగే చిత్రం ‘బ్రో’అని చెప్తున్నారు. కాలానికి ప్రతినిధిలాంటి పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటించారు. సాయిధరమ్‌తేజ్‌ కీలక పాత్రధారి.  మరి ఈ సినిమాకు ప్రభాస్   ‘ప్రాజెక్ట్ కే’కి ఒక పోలిక ఉందంటున్నారు. అదే కాలం.

ప్రస్తుతం మన దేశంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా  ‘ప్రాజెక్ట్-కే. రీసెంట్ గా ఈ ప్రాజెక్టులోకి లోక నాయకుడు కమల్ హాసన్ రావడంతో దీని స్కేల్ ఇంకా పెరిగింది. కమల్ హాసన్ సినిమాలో భాగమవ్వడం.. ఆ తర్వాత ‘కామిక్ కాన్’ నుంచి ఆహ్వానం అందుకోవడం.. అలాగే సినిమాకు సంబంధించి మెర్చండైజ్ అమ్మకాలతో సోషల్ మీడియాలో ‘ప్రాజెక్ట్-కే’ ట్రెండ్ అవుతూ వస్తోంది. 

ఇదే సమయంలో  ‘ప్రాజెక్ట్-కే’ టైటిల్ విషయంలోనూ ఇప్పుడు ఇంట్రస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ ఇందులో ‘కే’ అంటే ఏంటనే విషయంపై మీడియా లో ఓ వార్త ప్రచారం అవుతోంది. ఇందులో హీరో ప్రభాస్ కల్కి అవతారంలో కనిపిస్తాడు కాబట్టే టైటిల్లో ‘కే’ అని పెట్టారనే చర్చ నడిచింది ఇంతకుముందు. కానీ ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ‘కే’ అంటే అది కాదట. ‘కే’ అంటే ‘కాల చక్ర’ అని సమాచారం. బ్రో సినిమాలోనూ కాలం చుట్టూ కథ నడుస్తుంది. కాలమే ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్తున్నారు. 

అలాగే ప్రాజెక్టు కే  సినిమా టైం ట్రావెల్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్ననుంది. దాన్ని సూచించేలాగే ‘కాలచక్ర’ను పెట్టి టైటిల్లో ‘కే’ అని పెట్టారని చెప్తున్నారు. అలాగే ఇందులో  హీరో ప్రభాస్  చేపట్టే మిషన్ పేరు కూడా ‘ప్రాజెక్ట్ కాలచక్ర’ అని..  సమాచారం. ఈ విషయంపై త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతోంది. ఏదైమైనా ఇద్దరు పాపులర్ స్టార్స్ కాలం చుట్టూ తిరిగే కథలపై పనిచేస్తున్నారన్నమాట.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?