'సైరా' జోష్ తో కొత్త సినిమా షురూ.. చిరు నెక్స్ట్ మూవీ మొదలయ్యేది అక్కడే!

Published : Oct 05, 2019, 07:53 AM IST
'సైరా' జోష్ తో కొత్త సినిమా షురూ.. చిరు నెక్స్ట్ మూవీ మొదలయ్యేది అక్కడే!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. సైరా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రానికి వసూళ్లు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. నార్త్ లో సైరా చిత్రానికి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. చిరంజీవి ఈ చిత్రం కోసం దాదాపు 2 ఏళ్ళు కష్టపడ్డారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం తగ్గడంతో రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమాకు రెడీ అవుతున్నారు. 

మెగాస్టార్ తదుపరి చిత్రం కొరటాల దర్శకత్వంలో ఉండబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు నటీ నటుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ నవంబర్ లో ప్రారంభం కానుంది. 

తాజా సమాచారం మేరకు ఈ చిత్ర తొలి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు ప్రత్యేకంగా కొన్ని సెట్స్ నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో కొరటాల శివ ఫ్యామిలీ డ్రామాకు సంబంధించిన సన్నివేశాలని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?