బన్నీ, సుకుమార్ మూవీ కథ ఇదే.. పరోక్షంగా చెప్పేశారు.. చిత్తూరోళ్లే కావాలి!

By tirumala ANFirst Published Nov 6, 2019, 9:51 PM IST
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస చిత్రాలతో వేగం పెంచుతున్నాడు. బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వస్తున్న అల వైకుంఠపురములో చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. 

అల వైకుంఠపురములో చిత్రం తర్వాత సుకుమార్ దర్శత్వంలో అల్లు అల్లు అర్జున్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం ప్రారంభమైంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వాస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. రంగస్థలం లాంటి రికార్డు విజయం తర్వాత సుకుమార్ రూపొందిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. 

ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండబోతోందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా మైత్రి మూవీస్ సంస్థ చేసిన ప్రకటన చూస్తే ఆ వార్తలు నిజమే అని అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతుంది. 

అక్కడ లోకల్ గా ఉండే వ్యక్తులని ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగిస్తారు. తాజాగా మైత్రి మూవీస్ సంస్థ అల్లు అర్జున్ 20వ చిత్రానికి క్యాస్టింగ్ కాల్ ప్రకటన చేసింది. చిత్తూరు యాసలో అద్భుతంగా మాట్లాడగలిగే నటులు ఆడిషన్స్ కు రావాలని ఆహ్వానించింది. దీనితో ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరక్కబోతోందంటూ అభిమానులు ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. 

ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ చిత్రంలో స్మగ్లర్ గా రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు. సుకుమార్ బలమైన కథతోనే రంగంలోకి దిగినట్లు ఉన్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. 

 

బిన్నేగా రండి... pic.twitter.com/feAu3JG8Ci

— Mythri Movie Makers (@MythriOfficial)
click me!