మెగాస్టార్ 152కి అదిరిపోయే టైటిల్.. ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్!

Published : Oct 17, 2019, 06:01 PM IST
మెగాస్టార్ 152కి అదిరిపోయే టైటిల్.. ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఖైదీ నెం 150 చిత్రంతోనే చిరు రికార్డులు తిరగరాశారు. ప్రస్తుతం సైరా చిత్రం కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. అగ్ర దర్శకులంతా మెగాస్టార్ తో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారు. 

సైరా తర్వాత చిరంజీవి వరుస చిత్రాలని ఓకె చేస్తున్నారు. త్వరలో కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

ఈ నేపథ్యంలో చిరంజీవి 152వ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ అనుకుంటున్నారట. కథ పరంగా ఈ మూవీకి 'గోవింద ఆచార్య' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ టైటిల్ గా దీనినే కొనసాగిస్తారు. టైటిల్ పై చిత్ర యూనిట్ మొత్తం ఏకాభిప్రాయానికి వస్తే అధికారికంగా ప్రకటిస్తారు. 

'గోవింద ఆచార్య' అనే టైటిల్ చాలా బావుందంటూ అప్పుడే అభిమానులు సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టేశారు. ఫ్యాన్స్ మేడ్ పోస్టర్స్ తో హోరెత్తిస్తున్నారు. 

చిరు 152 మూవీ కథాంశం దేవాదాయ శాఖకు సంబంధించినదని ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు దేవాదాయ శాఖలో చేస్తున్న అవినీతిని వెలికితీసేలా ఈ చిత్రం ఉండబోతోంది. చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా ఈ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. 

 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?