పవన్ కళ్యాణ్ కోసం క్యూలో రాంచరణ్.. ఈ పుకార్లు ఆగవా!

Published : Oct 11, 2019, 06:11 PM IST
పవన్ కళ్యాణ్ కోసం క్యూలో రాంచరణ్.. ఈ పుకార్లు ఆగవా!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్ర మానియా కొనసాగుతోంది. సైరా చిత్రం ఇప్పటికే అద్భుత విజయం సాధించింది. ఖైదీ నెం 150, సైరా చిత్రాలతో రాంచరణ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా నిలిచాడు. సైరా విజయం సాధించడంతో రాంచరణ్ కేంద్రంగా కొత్త పుకార్లు మొదలవుతున్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ మూవీ ఖైదీ నెం150, ప్రతిష్టాత్మకంగా నటించిన సైరా రెండు చిత్రాలు సొంత ప్రొడక్షన్ నుంచే వచ్చాయి. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలని రాంచరణ్ చూసుకున్నాడు. 

కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే 152వ చిత్రానికి కూడా రాంచరణ్ ఓ నిర్మాత. ఇదిలా ఉండగా చరణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నాడని, ఆ చిత్రంలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోతున్నట్లు తాజాగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. 

అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ మరో చిత్రంలో నటించలేదు. పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. అయినా కూడా పవన్ మరో సినిమాలో నటించబోతున్నట్లు ఆధారాల్లేని పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం ఏఎం రత్నం, మైత్రి మూవీస్, హారిక అండ్ హాసిని సంస్థలు ఎదురుచూస్తున్నట్లు.. ఆ జాబితాలోకి రాంచరణ్ కూడా చేరినట్లు తాజా వార్తల సారాంశం. 

కానీ పవన్ మాత్రం సినిమాల ఊసే ఎత్తడం లేదు. రాజకీయంగా తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ వెళుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?