ఆ ముగ్గురిని తలచుకొని ఏడ్చేసిన దర్శకుడు శంకర్!

Published : Feb 29, 2020, 02:59 PM IST
ఆ ముగ్గురిని తలచుకొని ఏడ్చేసిన దర్శకుడు శంకర్!

సారాంశం

ఇప్పటికే నటుడు కమల్ హాసన్ కోటి రూపాయలు, చిత్ర నిర్మాత రూ.2 కోట్లను అందించిన సంగతి తెలిసిందే. కాగా.. శుక్రవారం దర్శకుడు శంకర్ మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. 

'ఇండియన్ 2' సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యూనిట్ సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే. వారిని ఆదుకోవడానికి దర్శకుడు శంకర్ రూ.కోటి విరాళం అందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే నటుడు కమల్ హాసన్ కోటి రూపాయలు, చిత్ర నిర్మాత రూ.2 కోట్లను అందించిన సంగతి తెలిసిందే.

కాగా.. శుక్రవారం దర్శకుడు శంకర్ మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన ఇండియన్ 2  సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదం షాక్ నుండి తాను ఇంకా కోలుకోలేదని అన్నారు. నెల రోజుల ముందే తన వద్ద సహాయకుడిగా చేరిన కృష్ణ మృతి ఆయన్ని బాధిస్తూనే ఉందని అన్నారు.

యూనిట్ లో చేరిన కొద్దిరోజుల్లోనే బాగా అర్ధం చేసుకొని చక్కగా పని చేసిన వ్యక్తి కృష్ణ అని, అతడిని కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. కృష్ణ ఫ్యామిలీని పరమర్శించడానికి వెళ్లినప్పుడు అతడి తల్లి పడ్డ ఆవేదన ఇంకా తన కళ్లలో మెదులుతూనే ఉందని బాధ వ్యక్తం చేశారు.  

ప్రొడక్షన్‌ బాయ్‌ మధుని మార్చురీలో చూసి వేదనకి గురయ్యానని.. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ చంద్రన్‌ మరణం తనను తీవ్రంగా బాధిస్తోందని కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ జరిపినా.. అనూహ్యంగా జరిగిన ప్రమాద ఘటనతో షాక్ నుండి బయటపడలేక వేదన పడుతున్నానని.. శంకర్ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?