ఇళయదళపతి విజయ్ అంటే ఇదీ.. ఏపీ, తెలంగాణకు కూడా..

Published : Apr 22, 2020, 05:11 PM IST
ఇళయదళపతి విజయ్ అంటే ఇదీ.. ఏపీ, తెలంగాణకు కూడా..

సారాంశం

ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం తమిళనాడులో తిరుగులేని స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాస్టర్ అనే చిత్రంలో విజయ్ నటిస్తున్నాడు.

ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం తమిళనాడులో తిరుగులేని స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాస్టర్ అనే చిత్రంలో విజయ్ నటిస్తున్నాడు. ఇటీవల ఐటీ దాడుల నేపథ్యంలో విజయ్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 

కరోనా నివారణకు, సహాయక చర్యలకు గాను దేశవ్యాప్తంగా సెలెబ్రిటీలంతా తమకు తోచిన విధంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా కరోనా నివారణకు విజయ్ తనవంతుగా భారీ విరాళాన్ని ప్రకటించారు. 

విజయ్ రూ 1.3 కోట్ల ఆర్థిక సాయాన్ని కరోనా సహాయక చర్యలకుగాను అందించబోతున్నట్లు ప్రకటించాడు. ఇందులో 50 లక్షలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి, 25 లక్షలు ప్రధాన మంత్రి సహాయ నిధికి అందించబోతున్నట్లు విజయ్ తెలిపారు. 

అదేవిధంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు 10 లక్షలు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చెరో 5 లక్షల విరాళాన్ని విజయ్ ప్రకటించారు. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరికి 5 లక్షల విరాళాన్ని విజయ్ ప్రకటించడం విశేషం. సినీ కళాకారుల కోసం విజయ్ మరో 25 లక్షలు ప్రకటించడం అతడి మంచి మనసుకు నిదర్శనం. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?