రోజాపై హైపర్ ఆది అసభ్యకర వ్యాఖ్యలు.. అలా అనేశాడేంటి!

Published : Oct 05, 2019, 01:36 PM ISTUpdated : Oct 05, 2019, 01:49 PM IST
రోజాపై హైపర్ ఆది అసభ్యకర వ్యాఖ్యలు.. అలా అనేశాడేంటి!

సారాంశం

జబర్దస్త్ షోతో మంచి పాపులారిటీ దక్కించుకున్న కమెడియన్లు చాలామందే ఉన్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, షకలక శంకర్, హైపర్ ఆది, సన్నీ వీళ్లంతా జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు పొందిన వాళ్లే. జబర్దస్త్ షోపై ఎన్ని వివాదాలు ఎదురైనా విజయవంతంగా కొనసాగుతోంది.     

అదిరిపోయే టైమింగ్ తో అలవోకగా కామెడీ పంచ్ లు వేయగల నటుడు హైపర్ ఆది. జబర్దస్త్ షోతో వచ్చిన క్రేజ్ తో ప్రస్తుతం ఆది పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. సినిమాల్లో వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే జబర్దస్త్ షో కొనసాగిస్తున్నాడు. జబర్దస్త్ షోకు ఏళ్ల తరబడి నాగబాబు, రోజా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ షోలో అప్పుడప్పుడూ సుధీర్, రాంప్రసాద్, హైపర్ ఆది లాంటి వాళ్ళు నాగబాబు, రోజాపై కూడా సరదాగా పంచ్ లు వేస్తుంటారు. కానీ రీసెంట్ గా హైపర్ ఆది తన స్కిట్ లో భాగంగా రోజాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారుతున్నాయి. హైపర్ ఆది కాస్త హద్దులు దాటి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. 

రీసెంట్ గా హైపర్ ఆది గద్దలకొండ గణేష్ గెటప్ లో స్కిట్ చేశాడు. అతడి భార్యగా రోహిణి, మరదలిగా శాంతిస్వరూప్ చేశారు. శాంతిస్వరూప్ తన డైలాగ్ చెబుతూ.. రాఘవేంద్ర రావు కనుక నన్ను చూసి ఉంటే పండులతో కొట్టేవారు అని అంటాడు. దీనికి హైపర్ ఆది బదులిస్తూ.. పండులతో, పావులతో కొట్టడానికి నువ్వేమైనా రోజా గారివా అని అనేశాడు. 

ఈ కామెంట్స్ కు రోజా ఒకింత షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆది జరిగిన డ్యామేజ్ ని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఆమె అంటే అందగత్తె కాబట్టి పళ్లతో కొడతారు.. నువ్వేంటి అని స్కిట్ కొనసాగించాడు. 

హైపర్ ఆది రోజాపై చేసిన వ్యాఖలతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. హైపర్ ఆదికి కామెడీకి, అపహాస్యానికి తేడా తెలియదా అంటూ విరుచుకుపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?