హాలీవుడ్ స్టార్ కి కరోనా.. భార్యకు కూడా పాజిటివ్!

By Prashanth MFirst Published Mar 12, 2020, 10:32 AM IST
Highlights

సినిమా ఇండస్ట్రీలను కూడా ఈ కరోనా వైరస్ చాలానే కలవరపెడుతోంది. ఇక ఇప్పుడు ఒక హాలీవుడ్ స్టార్ యాక్టర్ కి కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది.  కరోనా వల్ల చాలా వరకు సినిమా రిలీజ్ డేట్స్ వాయిదా పడుతున్నాయి. వైరస్ సోకకుండా సెలబ్రెటీలు సైతం అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ టామ్ హాంక్స్ వైరస్ భారిన పడ్డారు.

కరోనా వైరస్ కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. స్టాక్ మార్కెట్లు పరిస్థితి కూడా మరీ దారుణంగా మారింది. అలాగే సినిమా ఇండస్ట్రీలను కూడా ఈ కరోనా వైరస్ చాలానే కలవరపెడుతోంది. ఇక ఇప్పుడు ఒక హాలీవుడ్ స్టార్ యాక్టర్ కి కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది.  కరోనా వల్ల చాలా వరకు సినిమా రిలీజ్ డేట్స్ వాయిదా పడుతున్నాయి.

వైరస్ సోకకుండా సెలబ్రెటీలు సైతం అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ టామ్ హాంక్స్ వైరస్ భారిన పడ్డారు.  ఆస్ట్రేలియాలో ఉంటున్న టామ్ వెంటానే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆయన భార్య రీటా విల్సన్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో వారి ఫ్యామిలీ మెంబర్స్ కి సన్నిహితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. టామ్ తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రస్తుతం చిక్కిత్స తీసుకుంటున్నట్లు,, చెబుతూ అందరూ ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ ని సేఫ్ గా ఉంచడానికి తాము ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.  రీసెంట్ గా హ్యారీపోటర్‌ యాక్టర్ డేనియల్‌ ర్యాడ్‌క్లిఫ్‌కు కూడా వైరస్ సోకినట్లు వార్తలు రావడం అందరిని షాక్ గురి చేసింది.

అది కూడా బిబిసి న్యూస్ పేరిట ట్వీట్ వెలువడంతో నిమిషాల్లో ఆ ట్వీట్ వైరల్ అయ్యింది. కరోనా సోకిన సెలబ్రేటిస్ లో ప్రముఖ వ్యక్తి ర్యాడ్‌క్లిఫ్‌ ఒకరని పేర్కొనడం ఆయన ఫ్యాన్స్ ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని ర్యాడిక్లిఫ్‌ ప్రతినిధి కొట్టిపరేశారు. ర్యాడిక్లిఫ్‌ ఆరోగ్యంగానే ఉన్నాడంటూ.. ఆయనకు ఎలాంటి వైరస్ సోకలేదని సమాధానమిచ్చారు.

click me!