'హిట్' ట్రైలర్.. విశ్వక్ కొట్టేలా ఉన్నాడు

prashanth musti   | Asianet News
Published : Feb 19, 2020, 12:29 PM IST
'హిట్' ట్రైలర్.. విశ్వక్ కొట్టేలా ఉన్నాడు

సారాంశం

ఫలక్ నుమా దాస్ మూవీతో హడావుడి చేసిన యువ హీరో విశ్వక్ సేన్ అనుకున్నంతగా సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. ఆ సినిమాను సొంతంగా నిర్మించడమే కాకుండా తనే డైరెక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు నాని ప్రొడక్షన్ లో 'హిట్' మూవీ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ట్రైలర్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమాపై మరీంత బజ్ క్రియేట్ చేసింది.

ఫలక్ నుమా దాస్ మూవీతో హడావుడి చేసిన యువ హీరో విశ్వక్ సేన్ అనుకున్నంతగా సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. ఆ సినిమాను సొంతంగా నిర్మించడమే కాకుండా తనే డైరెక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు నాని ప్రొడక్షన్ లో హిట్ మూవీ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ట్రైలర్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమాపై మరీంత బజ్ క్రియేట్ చేసింది.

ఒక్క అమ్మాయి మిస్సింగ్ కేసులో కథానాయకుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది సినిమాలో మెయిన్ పాయింట్. విశ్వక్ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 28 సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో మొదట అ! అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. నిర్మాతగా నాని క్లిక్కవ్వడంతో నెక్స్ట్ కూడా అదే తరహాలో ఒక డిఫరెంట్ సినిమా చేయాలనీ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక ఫలక్ నుమా దాస్ చూసిన నాని వెంటనే విశ్వక్ సేన్ తో కొత్త సినిమా చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. కథలో విశ్వక్ డిఫరెంట్ షేడ్స్ లలో కనిపించే అవకాశం ఉన్నట్లు ఫస్ట్ లుక్ తోనే చెప్పేశారు. ఇక టీజర్ ట్రైలర్ కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంతో తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద విశ్వక్ బెస్ట్ హిట్టు కొట్టేలా ఉన్నాడని అర్ధమవుతోంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?