ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై దేశద్రోహం కేసు..!

By AN TeluguFirst Published Oct 4, 2019, 2:53 PM IST
Highlights


 దేశ రాజకీయాల్లో ఆసక్తిరేపిన 50మంది సెలబ్రిటీల లేఖ అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.దిగ్గజ దర్శకుడు మణిరత్నం సహా పలువురు మేధావులపై దేశద్రోహం కేసు నమోదయింది. 
 

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం సహా పలువురు మేధావులపై దేశద్రోహం కేసు నమోదైంది. మూకుమ్మడి దాడులు, హత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దేశంలోని వివిధ రంగాల్లో నిష్ణాతులైన యాభై మంది సెలబ్రిటీలపై ప్రధాని నరేంద్రమోదీకి బహిరంగ లేఖ రాసినందుకు రామచంద్ర గుహ, మణిరత్నం, అపర్ణా సేన్‌ తదితరులపై దేశద్రోహం కింద
ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

దాదాపు మూడు నెలల క్రితం దేశంలో అసహనం పెరిగిపోతుందని, మాబ్ లించింగ్ మితిమీరుతుందంటూ అదూర్ గోపాల్ కృష్ణన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, శ్యాం బెనగల్‌ అపర్ణాసేన్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, రామచంద్ర గుహ, శుభ ముద్గల్ సహా పలువురు సెలెబ్రిటీలు  ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. దీనికి నిరసనగా సుదీర్ కుమార్ ఓజీ బీహార్ లోని ముజఫర్ నగర్ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

దేశ ప్రతిష్టతకు భంగం కలిగించారని, ప్రధాని అధ్బుత పనితీరుని నాశనం చేసే విధంగా రాసిన లేఖపై యాభై మంది ప్రముఖులు సంతకాలు చేశారని ఆరోపిస్తూ ఓజా కోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ అంగీకరించిన చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ లేఖ రాసిన యాభై మంది ప్రముఖులపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆగస్ట్ 20న ఉత్తర్వులు ఇచ్చారని, ఈ క్రమంలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైందని ఓజా చెప్పారు.

ప్రధాని మోడీ హయాంలో దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ ఏకంగా ప్రధానమంత్రి ప్రభుత్వాన్ని ఉద్దేశించి యాభై మంది లేఖ రాయడం వెనుక వామపక్షభావజాల ప్రభావం ఉందని, కమ్యూనిస్టు భావజాలంతోనే వారంతా మోదీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని గతంలో కామెంట్స్ చేశారు. అయితే దీనికి మరో 62 మంది సెలబ్రిటీలు ఎదురుతిరిగారు.  

click me!