ఇర్ఫాన్ ఖాన్ మృతి.. వైరల్ అవుతున్న అభిమాని ట్వీట్

By Satish ReddyFirst Published Apr 29, 2020, 6:46 PM IST
Highlights

ఇర్ఫాన్‌ ఖాన్ మరణించిన సందర్భంగా ఓ అభిమాని షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇర్ఫాన్ కీలక పాత్రలో నటించిన హాలీవుడ్‌ చిత్రం `లైప్‌ ఆఫ్‌ పై`లో లైఫ్‌ గురించి ఇర్ఫాన్ చెప్పిన ఓ డైలాగ్‌ను ట్వీట్‌ చేస్తూ ఆయనకు నివాళులు ఆర్పించాడు ఓ అభిమాని.

లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ బుధవారం ఉదయం సుధీర్ఘ అనారోగ్యం తరువాత తుది శ్వాస విడిచారు.  దాదాపు రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఇర్ఫాన్ చివరకు ఆ పోరాటంలో ఓడిపోయాడు. ఆయన మృతి బాలీవుడ్ సినీ పరిశ్రమ మాత్రమే కాదు యావత్ దేశం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు ఇర్ఫాన్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంటే.. అభిమానులు ఆయన్ను మిస్ అవుతున్నాం అంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇర్ఫాన్ కీలక పాత్రలో నటించిన హాలీవుడ్‌ చిత్రం `లైప్‌ ఆఫ్‌ పై`లో లైఫ్‌ గురించి ఇర్ఫాన్ చెప్పిన ఓ డైలాగ్‌ను ట్వీట్‌ చేస్తూ ఆయనకు నివాళులు ఆర్పించాడు ఓ అభిమాని.

`మరణం మన జీవితాన్ని ముగిస్తుందని నేను అనుకుంటాను. అయితే అత్యంత బాధకరమైన విషయం ఏంటంటే చివరి సమయంలో మరణం ఒక్క క్షణం కూడా సమయం ఇవ్వదు` అంటూ ఇర్ఫాన్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోతో పాటు ఇర్ఫాన్ ఇతర సినిమాలో పోషించిన విలక్షణ పాత్రలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. హాలీవుడ్‌ డైరెక్టర్‌ అంగ్‌ లీ తెరకెక్కించిన `లైఫ్‌ ఆఫ్‌ పై` లో ఇర్ఫాన్‌తో పాటు హీరోయిన్‌ టబు, సూరజ్‌ శర్మ నటించారు.

Scene from "LIFE OF PI"

"I suppose in the end, the whole of life becomes an act of letting go, but what always hurts the most is not taking a moment to say goodbye"

We love and will miss you . 🙏💔 pic.twitter.com/BFz0kRGhis

— Devil V!SHAL (@VishalRC007)
click me!