డిజాస్టర్ దర్శకుడితో దుల్కర్ సల్మాన్ తెలుగు మూవీ

prashanth musti   | Asianet News
Published : Mar 18, 2020, 02:01 PM IST
డిజాస్టర్ దర్శకుడితో దుల్కర్ సల్మాన్ తెలుగు మూవీ

సారాంశం

మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళం స్టార్ హీరో మమ్ముంటి తనయుడైన దుల్కర్ సల్మాన్ ఏ పాత్ర చేసిన ఇట్టే క్లిక్కవుతుంది. ఒకే బంగారం సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. 

మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళం స్టార్ హీరో మమ్ముంటి తనయుడైన దుల్కర్ సల్మాన్ ఏ పాత్ర చేసిన ఇట్టే క్లిక్కవుతుంది. ఒకే బంగారం సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. మహానటిలో జెమిని గణేశన్ పాత్రని తనదైన శైలిలో ప్రజెంట్ చేసిన ఈ కుర్ర హీరో మంచి ప్రశంసలు అందుకున్నాడు.

ఇక ఆ  సినిమా తరువాత దుల్కర్ మరో తెలుగు సినిమా చేయలేదు. కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ కథ నచ్చకపోవడంతో నో చెప్పేశాడట. ఇక రీసెంట్ గా అందాల రాక్షసి దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన కథపై ఈ హీరో కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చివరగా ఈ దర్శకుడు తీసిన 'పడి పడి లేచే మనసు' డిజాస్టర్ గా నిలిచింది.  అయితే దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో దుల్కర్ సల్మాన్ డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని రోజుల క్రితం ఒక తమిళ్ సినిమాను రీమేడ్ చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్. దుల్కర్ ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట.

1996లో విక్రమ్ - అజిత్ నటించిన ఉల్లాసం అనే సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.  అయితే ఆ సినిమాను మళ్ళీ తెరకెక్కించేందుకు కథ ఒరిజినల్ దర్శకుడు జెడి - జెర్రీ సిద్ధమయ్యారు. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఆ లవ్ స్టోరీని సరికొత్తగా తెరకెక్కించాలని విక్రమ్ ప్రభు - దుల్కర్ సల్మాన్ లను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దుల్కర్ సల్మాన్ ఆ ఆ కథను తెలుగులో కూడా విడుదల చేసే విధంగా ముందే ఒక ప్లాన్ వేసుకోనున్నట్లు సమాచారం. మరి ఈ మహానటి హీరో ఆ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?