లాక్ డౌన్‌లో హాట్ రొమాన్స్‌.. ఒకే ఇంట్లో టైగర్‌, దిశా!

Published : Mar 30, 2020, 03:26 PM ISTUpdated : Mar 30, 2020, 03:38 PM IST
లాక్ డౌన్‌లో హాట్ రొమాన్స్‌.. ఒకే ఇంట్లో టైగర్‌, దిశా!

సారాంశం

హోం క్వారెంటైన్‌లో భాగంగా తన ఇంటి బాల్కనిలో వర్క్‌ అవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు టైగర్‌ ష్రాఫ్. అయితే ఒక్క రోజు గ్యాప్ లో అదే ప్లేస్‌ లో నిలుచొని దిగిన ఫోటోను హాట్ బ్యూటీ దిశా పటాని కూడా షేర్ చేసింది. దీంతో ఈ లాక్ డౌన్‌లో వాళ్లిద్దరు కసిని ఒకే ఇంట్లో ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.

భాగీ 2 సినిమాలో కలిసి నటించిన హాట్ కపుల్‌ టైగర్ ష్రాఫ్‌, దిశా పటానిల మధ్య అప్పటి నుంచి ఏదో ఉందన్న టాక్ బాలీవుడ్ మీడియాలో తరుచూ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను వారు ఖండించినా తరుచూ ప్రైవేట్ పార్టీలో కలిసి కనిపించటంతో పాటు తరువాత కూడా సినిమాల్లో కలిసి నటిస్తుండటంతో వారిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందన్న అనుమానాలు బాలీవుడ్ జనాల్లో ఉన్నాయి.

అయితే తాజాగా లాక్‌ డౌన్‌ సందర్భంగా ఆ అనుమానులు మరింతగా బలపడ్డాయి. ప్రస్తుతం కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు తమ పర్సనల్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్ తన వర్క్‌ అవుట్ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

హోం క్వారెంటైన్‌లో భాగంగా తన ఇంటి బాల్కనిలో వర్క్‌ అవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. అయితే ఒక్క రోజు గ్యాప్ లో అదే ప్లేస్‌ లో నిలుచొని దిగిన ఫోటోను హాట్ బ్యూటీ దిశా పటాని కూడా షేర్ చేసింది. దీంతో ఈ లాక్ డౌన్‌లో వాళ్లిద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. తన ఫోటోలతో పాటు దిశ ఎలాంటి కామెంట్ ను జోడించకపోవటంతో అవి ఇప్పుడు తీసిన ఫోటోలేనా లేక గతంలో తీసిన ఫోటోలా అన్న అనుమానం కూడా కలుగుతోంది. అయితే నెటిజెన్లు మాత్రం వారిద్దరు కలిసే ఉన్నారి ఫిక్స్ అయిపోతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల భాగీ 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైగర్ ప్రస్తుతం ఏ సినిమాకు అంగీకరించలేదు. ఇక దిశాపటాని విషయానికి వస్తే బాలీవుడ్‌ లో కే టినా, రాధే సినిమాల్లో నటిస్తోంది దిశా.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?