డిస్కో రాజా ప్రీమియర్ షో టాక్

prashanth musti   | Asianet News
Published : Jan 24, 2020, 06:36 AM IST
డిస్కో రాజా ప్రీమియర్ షో టాక్

సారాంశం

రుస అపజయలతో సతమతమవుతున్న హీరోల్లో రవితేజ ఒకరు. మాస్ మహారాజా హిట్టు కొట్టి చాలా కాలమవుతోంది. అందుకే ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఒక స్కై ఫై కథతో రెడీ అయ్యాడు. విఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన డిస్కో రాజా సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.

టాలీవుడ్ లో వరుస అపజయలతో సతమతమవుతున్న హీరోల్లో రవితేజ ఒకరు. మాస్ మహారాజా హిట్టు కొట్టి చాలా కాలమవుతోంది. అందుకే ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఒక స్కై ఫై కథతో రెడీ అయ్యాడు. విఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన డిస్కో రాజా సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. పలు చోట్ల సినిమా ప్రీమియర్స్ ని కూడా ప్రదర్శించారు.

ఇక సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ టాక్ విషయానికి వస్తే..మొదట డిస్కో రాజా కాన్సెప్ట్ తోనే ఆడియెన్స్ లో అంచనాలు భారీగా పెంచేశారు. సైన్స్ ఫిక్ఛన్ కాన్సెప్ట్ అని పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం సినిమాకు కలిసొచ్చింది. అయితే సినిమా మాత్రం ఆ పాజిటివ్ అంచనాలను అందుకోలేకపోయినట్లు తెలుస్తోంది. స్టోరీ లో పెద్దగా కొత్తదనం ఏమి అనిపించదు. కానీ రవితేజ పాత్రను తెరకెక్కించిన విధానం చాలా బావుంది.

దర్శకుడు ఓపెనింగ్ లొనే హీరో స్థాయికి తగ్గట్లు పాత్ర జనాల్లోకి వెళ్లేలా చూపించాడు. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయాలని చాలానే కష్టపడ్డారు. రవితేజ పాత్రతో హోరోయిన్స్ సభా నటేష్ - పాయల్ రాజ్ పూత్ క్యారెక్టర్స్ కూడా సినిమాలో మరొక ప్లస్ పాయింట్.   ఈ స్కై ఫై కాన్సెప్ట్ ని రివెంజ్ డ్రామా గా మలిచిన విధానం కాస్త రొటీన్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక సినిమాకు మరో ప్లస్ పాయింట్. అయితే ఫైనల్ గా ప్రీ క్లయిమ్యాక్స్ లో ఆడియెన్స్ ఊహలకు సినిమా అందుకోలేకపోవచ్చు. ఏదేమైనా సినిమాను పూర్తిగా మాస్ ఆడియెన్స్ చూసేవరకు చెప్పలేము.

అక్కడక్కడా బోర్ కొట్టించి సన్నివేశాలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు రవితేజ పాత్ర సినిమా వాతావరణాన్ని చేంజ్ చేస్తుంటుంది. బార్ సీన్ సినిమాలో హైలెట్ అని చెప్పవచ్చు. ఇక మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ బావున్నాయి. దానికి తగ్గట్లు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..సాంగ్స్ తెరకెక్కించిన విధానం ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. మొత్తానికి సినిమా పరవలేదని చెప్పవచ్చు గాని.. సినిమా అసలు రిజల్ట్ తెలియాలి అంటే నేటి సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?