సురేందర్ రెడ్డి నెక్ట్స్ హీరో ఎవరంటే...?

By Prashanth MFirst Published Feb 17, 2020, 7:10 PM IST
Highlights

సక్సెస్ ఉంటే అందరూ మన చుట్టూ ఉంటారు. ఒక్కసారి దారి తప్పి ఫెయిల్యూర్ పలకరించిందా అంతే సంగతులు. ఎవరూ తమతో సెల్ఫీ తీసుకోవటానికి కూడా ఆసక్తి చూపరు. ఇప్పుడు సురేంద్రరెడ్డి పరిస్దితి అదే. మెగాస్టార్ చిరంజీవితో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన 'సైరా' సినిమా సక్సెస్ కాకపోవటం దర్శకుడుగా సురేంద్రరెడ్డికి పెద్ద దెబ్బగా మారింది

ఈ సినీ పరిశ్రమలో సక్సెస్ ఉంటే అందరూ మన చుట్టూ ఉంటారు. ఒక్కసారి దారి తప్పి ఫెయిల్యూర్ పలకరించిందా అంతే సంగతులు. ఎవరూ తమతో సెల్ఫీ తీసుకోవటానికి కూడా ఆసక్తి చూపరు. ఇప్పుడు సురేంద్రరెడ్డి పరిస్దితి అదే. మెగాస్టార్ చిరంజీవితో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన 'సైరా' సినిమా సక్సెస్ కాకపోవటం దర్శకుడుగా సురేంద్రరెడ్డికి పెద్ద దెబ్బగా మారింది.

ఆ సినిమా తర్వాత వెంటనే ప్రభాస్ తో సినిమా  చేయవచ్చు అనుకున్న సురేంద్రరెడ్డి ఆశలు తలక్రిందులయ్యారు. దాంతో 'సైరా' తరువాత ఆయన ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు.  చిన్న హీరోలు దగ్గరకు వెళ్లి సినిమాలు చేసే పరిస్దితిలో సురేంద్రరెడ్డి లేడు. పెద్ద హీరోలెవరూ సురేంద్రరెడ్డి తో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపటం లేదు.

ఇది చాలా విచిత్రమైన పరిస్దితి. ఓ మెట్టు దిగి క్రిందకు వెళ్లి చిన్న హీరోతో పెద్ద సినిమా చేద్దామా అంటే బడ్జెట్ సమస్యలు వస్తున్నాయి. బోయపాటి ఎదుర్కొన్న పరిస్దితే సురేంద్రరెడ్డిది కూడా. ఈ నేపధ్యంలో ఎట్టకేలకు ఓ హీరోని ఒప్పించినట్లు సమాచారం. అయితే బడ్జెట్ కంట్రోలులో చేస్తాననే కండీషన్ తో అని తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు అఖిల్.

అఖిల్ కు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. అయితే అతను బాడీ లాంగ్వేజ్ దానికి సహకరించటం లేదు. అయితే సరే ప్రయత్నాలు మానదలచుకోలేదు. అందులో భాగంగానే సురేంద్రరెడ్డి ప్రాజెక్టుని ఓకే చేసినట్లు చెప్తున్నారు. వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న అఖిల్... ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' సినిమా చేస్తున్నాడు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా ముగింపు దశలో ఉండగానే తదుపరి ప్రాజెక్టును అఖిల్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు బయిటకు రానున్నాయి.

click me!