నాని - సమంతలపై గాసిప్స్.. అన్ని అబద్దాలే!

Published : Nov 04, 2019, 02:50 PM IST
నాని - సమంతలపై గాసిప్స్.. అన్ని అబద్దాలే!

సారాంశం

ప్రస్తుతం పెద్ద సినిమాలకు సంబందించిన కొన్ని ఫేక్ పోస్టర్స్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అందులో చాలా వరకు అఫీషియల్ పోస్టర్స్ లానే కనిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా నాని పేరుతో ఉన్న మరో పోస్టర్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.  శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ లో సమంత కూడా హీరోయిన్ గా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. 

టాలీవుడ్ లో గాసిప్స్ డోస్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పెద్ద సినిమాలకు సంబందించిన కొన్ని ఫేక్ పోస్టర్స్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అందులో చాలా వరకు అఫీషియల్ పోస్టర్స్ లానే కనిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా నాని పేరుతో ఉన్న మరో పోస్టర్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ లో సమంత కూడా హీరోయిన్ గా నటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఈ విషయం నిజమని కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ విషయంపై వెంటనే దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన నెక్స్ట్ సినిమా అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతూ.. త్వరలోనే ఆ విషయాలపై క్లారిటీ ఇస్తానని చెప్పాడు.

నానితో సినిమా చేస్తున్నట్లు రిలీజైన పోస్టర్ కూడా ఫెక్ అని డైరెక్టర్ కొట్టిపారేశారు. ఇక గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. బహుశా రౌడీ స్టార్ తో దర్శకుడు డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?