క్రేజీ డైరెక్టర్ బర్త్ డే సెలెబ్రేట్ చేసిన చైతు, సాయి పల్లవి.. ఫొటోస్

Published : Feb 04, 2020, 09:55 PM IST
క్రేజీ డైరెక్టర్ బర్త్ డే సెలెబ్రేట్ చేసిన చైతు, సాయి పల్లవి.. ఫొటోస్

సారాంశం

టాలీవుడ్ క్రేజీ దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. శేఖర్ కమ్ముల చిత్రాల్లో మిగిలిన దర్శకుల చిత్రాలకు విభిన్నంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శేఖర్ కమ్ముల చిత్రాలలో కమర్షియల్ అంశాలు తక్కువగా ఉంటాయి. సున్నితమైన అంశాలని శేఖర్ కమ్ముల వెండితెరపై తనదైన శైలిలో చూపిస్తారు. 

హ్యాపీడేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా ఇలా ఆణిమ్యుత్యాలాంటి సినిమాలు శేఖర్ కమ్ముల దర్శత్వంలో వచ్చాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'లవ్ స్టోరీ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

నేడు(మంగళవారం) దర్శకుడు శేఖర్ కమ్ముల తన 48వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. లవ్ స్టోరీ చిత్ర యూనిట్ శేఖర్ కమ్ముల జన్మదిన వేడుకల్ని సెట్స్ లోనే నిర్వహించింది. ఈ వేడుకల్లో నాగ చైతన్య, సాయి పల్లవి ఇతర చిత్ర యూనిట్ పాల్గొన్నారు. 

ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్ మోహన్ రావు ఈ చిత్రానికి నిర్మాతలు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?