#ElectionResults2019 : సినీనటి దీపాలీ సయ్యద్ వెనుకంజ

By AN TeluguFirst Published Oct 24, 2019, 12:26 PM IST
Highlights

హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో 64 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరాఠీ సినీనటి దీపాలీ సయ్యద్ శివసేన పార్టీలో చేరారు. శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే, అతని కుమారుడు ఆదిత్య థాక్రేల సమక్షంలో దీపాలీ శివసేన తీర్థం స్వీకరించారు. అక్టోబరు 21వతేదీన జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబ్రా కల్వ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎన్సీపీ పార్టీ జితేంద్ర ఆహ్వాద్ కి పోటీగా నిలబడింది. అయితే ఇప్పటివరకు లెక్కించిన ఓట్ల ప్రకారం దీపాలి వెనుకంజలో ఉంది. 

హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో 64 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ 64 స్థానాల్లో తెలంగాణ లోని హుజూర్ నగర్ స్థానం కూడా ఉంది.  

#ElectionResults2019 : టిక్ టాక్ స్టార్ కి ఓటమి తప్పదా..?

మహారాష్ట్ర, హర్యానాల్లో వోటింగ్ శాతం గతంతో పోలిస్తే తగ్గింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో 63 శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అంతకన్నా తక్కువగా కేవలం 60శాతం మాత్రమే నమోదయింది. హర్యానాలో గత దఫా 77 శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సరి అది దాదాపుగా 12శాతం తగ్గి 65 శాతం నమోదయ్యింది. 

ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే హర్యానా,మహారాష్ట్రలో కమలం పార్టీ పూర్తి హవా ప్రదర్శిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెబుతున్నాయి. హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ లు మరోమారు ముఖ్యమంత్రి పీఠాలు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. 

 

click me!