గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మనవడితో మొక్కలు నాటిన దిల్ రాజు

prashanth musti   | Asianet News
Published : Jan 11, 2020, 07:45 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మనవడితో మొక్కలు నాటిన దిల్ రాజు

సారాంశం

జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నేడు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ లోని తన నివాసంలో తన మనువడితో కలిసి 3 మొక్కలు నాటడం జరిగింది.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నేడు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ లోని తన నివాసంలో తన మనువడితో కలిసి 3 మొక్కలు నాటడం జరిగింది.

ఈసందర్భంగా దిల్ రాజు గారు మాట్లాడుతూ నా మిత్రులు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని దీని వలన మన రాష్ట్రం మన దేశం ఆకుపచ్చగా మారబోతున్నది అని ఈ సందర్భంగా సంతోష్ గారికి అభినందనలు తెలిపారు. అదే విధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా మరొక ముగ్గురికి ఈ చాలెంజ్ ఇస్తున్నానని వారు కూడా స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు 1)ప్రముఖ హీరో మహేష్ బాబు 2) డైరెక్టర్స్  వంశీ పైడిపల్లి  3)అనిల్ రావిపూడి లను మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?