మహాభారతం: ద్రౌపదిగా దీపికా పదుకొనె.. ఆమె యాంగిల్ లోనే కథ!

By tirumala ANFirst Published Oct 25, 2019, 7:37 PM IST
Highlights

పురాణగాథ మహాభారతం ఆధారంగా ఇప్పటికే వెండితెరపై అనేక చిత్రాలు వచ్చాయి. కానీ మహాభారతం సముద్రం లాంటి కథ. మహాభారతంపై ఎన్ని సినిమాలైనా తెరకెక్కించవచ్చు. బాలీవుడ్ లో మహాభారతం చిత్రాన్ని తెరక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. 

ప్రముఖ నిర్మాత మధు మంతెన మహాభారతం చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం గురించి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. తాను ఈ చిత్రంలో  ద్రౌపది పాత్రలో నటించబోతున్నట్లు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రకటించింది. 

దీపికా ఈ చిత్రాన్ని సహనిర్మాత కూడా. ఓ ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. ద్రౌపది పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నా. మేము తెరక్కించబోయే మహాభారతం సరికొత్తగా ఉండబోతోంది. ద్రౌపది కోణంలో మహాభారతం చిత్రాన్ని అందరికి గుర్తుండిపోయేలా తెరక్కించబోతున్నాం అని దీపికా తెలిపింది. 

మధుమంతెన మాట్లాడుతూ.. మహాభారతం కథ అందరికి తెలుసు. అందుకే మేము కొంచెం కొత్తగా ద్రౌపది పాత్రని కీలకంగా చూపించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. బాజీరావు మస్తానీ, పద్మావత్ లాంటి హిస్టారికల్ చిత్రాల్లో నటించిన దీపికా పదుకొనె  ద్రౌపది మరో ఛాలెంజింగ్ రోల్ ఎంచుకుంది. 

click me!