దాసరి ఆస్తి వివాదం: అన్న ప్రభు ఆరోపణలకు అరుణ్ ఘాటు రిప్లై

By Sreeharsha GopaganiFirst Published Jun 27, 2020, 12:09 PM IST
Highlights

దాసరి కుమారుల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నేడు ఫీల్ చాంబర్ వద్ద దాసరి అరుణ్ కుమార్ విలేఖరులతో మాట్లాడారు. తన సోదరుడు తన గురించి చెబుతున్నవిషయాలు అవాస్తవాలని, ఒకవేళ సాక్ష్యాధారాలుంటే... తనను రుజువుచేయమని చెప్పండి అంటూ సవాల్ విసిరారు.

దాసరి కుమారుల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. నిన్న సోదరుడైన హీరో అరుణ్ కుమార్ మీద ప్రభు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24వ తేదీన అరుణ్ కుమార్ గేటు దూకి అక్రమంగా తన ఇంట్లోకి ప్రవేశించాడని, తమపై దౌర్జన్యం చేశాడని ఆయన ఫిర్యాదు చేశారు. 

అరుణ్ కుమార్ గేటు దూకి లోనికి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డు అయ్యాయి. మోహన్ బాబు, సి. కల్యాణ్, మురళీ మోహన్ ఈ ఘటనపై స్పందించాలని ప్రభు కోరారు. అరుణ్ కుమార్ ఈ నెల 24వ తేదీన ఇంట్లోకి ప్రవేశించి తన భార్య మీద కూడా చేయి చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో నేడు ఫీల్ చాంబర్ వద్ద దాసరి అరుణ్ కుమార్ విలేఖరులతో మాట్లాడారు. తన సోదరుడు తన గురించి చెబుతున్నవిషయాలు అవాస్తవాలని, ఒకవేళ సాక్ష్యాధారాలుంటే... తనను రుజువుచేయమని చెప్పండి అంటూ సవాల్ విసిరారు. ఊరికే ఇండస్ట్రీ పెద్దలను ఈ గొడవ సెటిల్ చేయమని  మోహన్ బాబు, సి. కల్యాణ్, మురళీ మోహన్ లను పిలుస్తుంటే.... తాను ప్రిన్స్ హరీ, తన సోదరుడు ఒక ప్రిన్స్ విలియమ్స్ కాదు కదా తమ ఆస్తిలో గొడవలను సెటిల్ చేయడానికి అని అన్నారు. 

తన నంసోదరుడిపై తాను దాడి చేశాను అని చెబుతున్న విషయంలో కూడా వాస్తవం లేదని, తన సోదరుడు కూడా బలిష్టంగా ఉన్నందున తాను ఎలా అతనిని భుజాలపై వేసుకొని వెళ్లగలనని ప్రశ్నించాడు. 

ఆ ఇల్లు తమ ముగ్గురికి చెందిందని, కోర్టు ఆదేశాలనుసారం ఆ ఇంటిని ఏ ఒక్కరికి తెలియకుండా కూడా అమ్మొద్దని రాసిందని అరుణ్ అన్నాడు. తన మీద ఆరోపణలు చేసినంత మాత్రాన సరిపోదు కదా అని అన్నాడు. ఆ ఇల్లు తమ ముగ్గురిది అని, ఏ ఒక్కరిదో కాదు అని అంటున్నాడు. 

తన సోదరుడికి ఇల్లు లేనందితమాత్రాన ఆ ఇల్లు తనది కాకుండా పోదు అని, అది తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తి అని అన్నాడు అరుణ్ కుమార్. నిన్న ప్రభు మాట్లాడుతూ... తన ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యంగా పై అంతస్తుకు వెళ్లి బీరువా తెరవడానికి ప్రయత్నించాడని, అందులో విలువైన వస్తువులున్నాయని ప్రభు చెప్పారు. తన అత్తామామల మీద కూడా అరుణ్ కుమార్ చేయి చేసుకున్నాడని ఆయన అన్నారు. పోలీసుల ముందే తనపై దాడి చేశాడని ఆయన ఆరోపించారు. 

చట్టప్రకారమే తాను ఈ ఇంట్లో ఉంటున్నట్లు ఆయన తెలిపారు. దాసరి నారాయణ రావును ఇల్లును తన కూతురు పేరు మీద రాసిచ్చాడని ఆయన చెప్పారు. దాసరి నారాయణ రావు తన మనవరాలికి రాసిచ్చిన వీలునామా ప్రకారమే ఇంట్లో తాము ఉంటున్నామని ఆయన చెప్పారు.  ఈ ఇంటి విషయంలో తాము కోర్టు కేసు గెలిచినట్లు ఆయన తెలిపారు.

ఈ ఆరోపణలపై స్పందించిన అరుణ్ స్పందిస్తూ... డాకుమెంట్స్ ఉంటె చూపెట్టాలని డిమాండ్ చేసారు. మీడియాకు వెళ్లి ఈ విషయం చెబితే సమస్య పరిష్కారం కాదు కదా అని అన్నాడు. ఇప్పుడు తాను వెళ్లి తన సోదరుడి మీద కూడా కేసు పెడితే సమస్య పరిష్కారం కాదు కదా అని అరుణ్ అన్నాడు. 

click me!