మరో సినిమా స్టార్ట్ చేయనున్న వెంకీ.. మామ స్పీడ్ మాములుగా లేదు

Published : Oct 17, 2019, 08:56 AM IST
మరో సినిమా స్టార్ట్ చేయనున్న వెంకీ.. మామ స్పీడ్ మాములుగా లేదు

సారాంశం

నెక్స్ట్ వెంకీ.. వెంకీ మామ సినిమాను విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. సినిమాలో నాగ చైతన్య మరో హీరోగా నటిస్తుండడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. 

విక్టరీ వెంకటేష్ F2 అనంతరం బౌన్స్ బ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే ఒకేసారి మూడు కథలను లైన్ లో పెట్టాడు. నెక్స్ట్ వెంకీ మామ సినిమాను విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. సినిమాలో నాగ చైతన్య మరో హీరోగా నటిస్తుండడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.  

డిసెంబర్ లో లేదా జనవరిలో సినిమా రిలీజ్ కానుందని ఇప్పటికే అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.  నిర్మాత సురేష్ బాబు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఇకపోతే వెంకీ మామకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న వెంకీ మరో కథను స్టార్ట్ చేయడానికి సిద్దమయ్యాడు. యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది.  

ఇక రెగ్యులర్ షూటింగ్ ని డిసెంబర్ లో మొదలుపెట్టాలని వెంకటేష్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఆ సినిమాతో పాటు త్రినాథ రావ్ నక్కిన ప్రాజెక్ట్ ని కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ వెంకటేష్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు కథలను కూడా వెంకీ వెయిటింగ్ లిస్ట్ లో ఉంచాడు. ముందుగా తరుణ్ భాస్కర్ సినిమాను మూడు నాలుగు నెలల్లో ఫినిష్ చేయాలనీ వెంకీ మామ ఆలోచిస్తున్నట్లు టాక్.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?