కోలీవుడ్ లో కరోనా.. ఆగిపోయిన 500కోట్ల ప్రాజెక్ట్!

prashanth musti   | Asianet News
Published : Mar 16, 2020, 09:52 AM IST
కోలీవుడ్ లో కరోనా.. ఆగిపోయిన 500కోట్ల ప్రాజెక్ట్!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలను కూడా ఈ కరోనా వైరస్ చాలానే కలవరపెడుతోంది. మొన్నటివరకు షూటింగ్ పనులతో హడావుడిగా కనిపించిన కోలీవుడ్ సుడియోలు ఇప్పుడు నిర్మానుష ప్రాంతాలుగా దర్శనమిస్తున్నాయి.  అవుట్ డోర్ షెడ్యూల్స్ ని కూడా ఛాలా వరకు క్యాన్సిల్ చేసుకున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే కోలీవుడ్ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ 'పొన్నియన్ సెల్వన్' కి కూడా కరోనా దెబ్బ గట్టిగానే పడింది.

కరోనా వైరస్ కదెబ్బకు చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ సైతం కుప్పకూలుతోంది. స్టాక్ మార్కెట్లు పరిస్థితి కూడా మరీ దారుణంగా మారింది.  ఇక సినిమా ఇండస్ట్రీలను కూడా ఈ కరోనా వైరస్ చాలానే కలవరపెడుతోంది. మొన్నటివరకు షూటింగ్ పనులతో హడావుడిగా కనిపించిన కోలీవుడ్ సుడియోలు ఇప్పుడు నిర్మానుష ప్రాంతాలుగా దర్శనమిస్తున్నాయి. అవుట్ డోర్ షెడ్యూల్స్ ని కూడా ఛాలా వరకు క్యాన్సిల్ చేసుకున్నారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే కోలీవుడ్ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ 'పొన్నియన్ సెల్వన్' కి కూడా కరోనా దెబ్బ గట్టిగానే పడింది. మొన్నటివరకు చలాకీగా సాగిన ఈ సినిమా షూటింగ్ కి సడన్ గా బ్రేక్ పడింది. పూణే లో చేయాల్సిన షెడ్యూల్ ని వాయిదా వేశారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 500కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

విక్రమ్ - కార్తీ - జయం రవి వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో  బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ - కీర్తి సురేష్ - అమలాపాల్  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోగా రీసెంట్ మలయాళం సీనియర్ యాక్టర్ జయ రామ్ కూడా సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?