ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె స్నేహితుడు ఒజాస్ దేశాయ్ ఇంతవరకు పోలీసులకు దొరక్కపోవటం కలవరం కలిగిస్తోంది.
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య లండన్ నుంచి వచ్చిన కనికా తరువాత ఆమె పార్టీల్లో పాల్గొంది. ఆ తరువాత ఆమె కరోనా పాజిటివ్‌గా తేలటంతో ఒక్క సారిగా ప్రభుత్వం ఉలిక్కి పడింది. ఈ గాయని పాల్గొన్న పార్టీల్లో పలువరు పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొనటం, తరువాత వారు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో నెటిజెన్లు కనికా తీరుపై ఫైర్ అవుతున్నారు.
ఈ విషయంలో కనికా వ్యవహారంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆమె చర్యలపై సీరియస్‌గా ఉంది. శుక్రవారం జరిగి ప్రభుత్వ సమావేశంలో కనికా కపూర్ మీద ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేయాలని నిర్ణయించారు. అందుకు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా అనుమతించటంతో ఆమె మీద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే విదేశాల నుంచి వచ్చిన తరువాత కనికా ను కలిసి దాదాపు 260 మంది ని లక్నో పోలీసులు ట్రేస్ చేశారు. కానీ ఆమె స్నేహితుడు ఒజాస్ దేశాయ్ మాత్రం ఇంత వరకు పోలీసులకు దొరకలేదు. దీంతో పోలీసులు ఒజాస్ కోసం గాలిస్తున్నారు. ముంబైలో ఆయనకు సరైన అడ్రస్ లేకపోవటంతో ఒజాన్‌ను ట్రేస్ చేయటం కష్టమవుతుందని తెలిపాడు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర అగర్వాల్. అయితే ఒజాస్ అందుబాటులో లేకపోయినా తనపై వస్తున్న వార్తలపై ఆయన సోషల్ మీడియాలో స్పందించాడు. తాను ఎక్కడ ఉన్నది వెల్లడించకపోయినా తనకు కరోనా సోకలేదని ఓ డాక్టర్ రిపోర్ట్‌ను తన ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేశాడు ఒజాస్.
// COVID19 : NEGATIVE //
All of us need to stay calm united and sensible. pic.twitter.com/uYJSZv61ee