ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే...చిరుని గిల్లటం మొదలెట్టారే

చిరంజీవి కెరీర్ మళ్లీ గాడిలో పడుతోంది. ఆయన స్ట్రెయిట్ సబ్జెక్టులు వెతుక్కుంటున్నారు. రీమేక్ లు బై చెప్పినట్లే . కానీ ఈ  సినిమా మాత్రం...



మలయాళీ సూపర్ స్టార్ మోహ‌న్ లాల్ (Mohan Lal)ప్రధాన పాత్రల్లో వ‌చ్చిన చిత్రం లుసిఫ‌ర్ (Lucifer)అక్కడ 2019లో ఘన విజయం సాధించింది. తెలుగులో దాన్ని డబ్ చేసి సురేష్ ప్రొడక్షన్ వాళ్లు రిలీజ్ చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఈ సినిమాకు మలయాళీ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ  సినిమాను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గాడ్ ఫాద‌ర్‌ (God Father) పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో అక్కడ అంత సక్సెస్ కాలేదు. కానీ బాగానే ఆడింది. సర్లే ఈ విషయం తెలిసిందే కదా,మళ్లీ ఈ టాపిక్ ఎందుకు అంటారా..ఇప్పుడు  ఈ చిత్రం నుంచి సీక్వెల్ వ‌స్తున్న‌ట్లు మేక‌ర్స్ ఫస్ట్ లుక్ తో ప్రకటన వచ్చింది.  లుసిఫ‌ర్ 2 ఎంపురాన్ (Lucifer 2 Empuraan) అనే టైటిల్‌తో ఈ సినిమా రానుండ‌గా.. ప్ర‌స్తుతం ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. 

ఇదిలా ఉంటే దీపావ‌ళి కానుక‌గా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ అప్‌డేట్‌ను ఇచ్చారు. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది. మీడియా వారు..చిరంజీవి ఈ చిత్రాన్ని కూడా రీమేక్ చేస్తారా అని గిల్లటం మొదలెట్టారు. అయితే భోళా శంకర్ రీమేక్ తర్వాత చిరంజీవి ఇక రీమేక్ లు చేయకూడదని ఫిక్స్ అయ్యినట్లు వార్తలు వచ్చాయి. దానికి తోడు ఎంపురాన్ కూడా ప్యాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. అంటే తెలుగులోకు డైరక్ట్ డబ్బింగ్ అయ్యి వస్తుందన్నమాట. కాబట్టి మాగ్జిమం చిరంజీవి ఈ సినిమా జోలికి వెళ్లే అవకాసం అయితే ఉండదనే చెప్పాలి. 

Latest Videos

ఇక లూసీఫర్ ఫస్టు పార్టును తెరకెక్కించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ .. సెకండు పార్టుకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో  సెట్స్ పైకి వెళ్లిందని సమాచారం. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర మరింత పవర్ఫుల్ గా కనిపించనుందని ఫస్ట్ లుక్ ని బట్టి అర్దమవుతోంది.  ఫ‌స్ట్ లుక్ గ‌మ‌నిస్తే.. గ్యాంగ్ స్టర్‌గా గ‌న్ ప‌ట్టుకుని మోహన్ లాల్ హెలికాప్టర్ వైపు చూస్తున్నట్లు ఫుల్ యాక్ష‌న్ మోడ్‌లో ఉంది. ఈ చిత్రానికి మురళి గోపి స్టోరీ అందిస్తున్నాడు. కాగా ఇందులో సూపర్ స్టార్ మోహన్ లాల్ మరింత స్టైలిష్‏గా కనిపించ‌నున్న‌ట్లు టాక్. అలాగే  తెరపై ఆయన కనిపించే నిడివి కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కోసం మోహన్ లాల్ 6 నెలల సమయాన్ని కేటాయించినట్టు చెబుతున్నారు. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాతనే ఆయన మరో సెట్ పైకి వెళతాడని అంటున్నారు. 

click me!