ali mother: అలీ తల్లి మృతి.. మెగాస్టార్ నివాళి

prashanth musti   | Asianet News
Published : Dec 19, 2019, 01:47 PM ISTUpdated : Dec 19, 2019, 03:02 PM IST
ali mother: అలీ తల్లి మృతి.. మెగాస్టార్ నివాళి

సారాంశం

స్టార్ కమెడియన్‌, టెలివిజన్‌ హోస్ట్‌ అలీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అలీ నివాసానికి చేరుకొని తల్లి మృతదేహానికి నివాళుర్పించారు.

తెలుగు ప్రముఖ నటుడు స్టార్ కమెడియన్‌, టెలివిజన్‌ హోస్ట్‌ అలీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అలీ నివాసానికి చేరుకొని తల్లి మృతదేహానికి నివాళుర్పించారు.

అలీ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.  జైతున్‌ బీబీ రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. వృధ్యాప్య సమస్యలతో గత కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అస్వస్థకు గురయ్యారు, అనంతరం రాజమండ్రిలోని హాస్పటిల్ లో చికిత్స తీసుకుంటున్నారు.

ఇటీవల షూటింగ్ నిమిత్తం జార్ఖండ్ కి వెళ్లిన అలీ.. తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ కి చేరుకున్నారు.  ఇక జైతున్ బీబీ భౌతిక కాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు తరలించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ‌లో జైతున్ అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?