అభిమానికి మెగా సాయం.. లాక్‌ డౌన్‌లోనూ గుండె ఆపరేషన్‌

By Satish ReddyFirst Published Apr 7, 2020, 2:41 PM IST
Highlights

తీవ్రమైన గుండెజబ్బుతో ఇబ్బంది పడుతున్న అభిమాని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. గుంటూరుకు చెందిన ఆమెను హైదరాబాద్‌కు రప్పించి ఓ ప్రముఖ సర్జన్‌తో ఆమెకు శస్త్రచికిత్స చేయిస్తున్నారు మెగాస్టార్‌.

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తారో అందరికీ తెలిసిందే. తనను మెగాస్టార్ ను చేసిన అభిమానుల కోసం ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. బ్లడ్‌ బ్యాంక్ ద్వారా లక్షల ప్రాణాలు కాపాడిన చిరు ఐ బ్యాంక్‌ ద్వారా ఎంతో మంది కంటి చూపు అందించాడు. ప్రకృతి విపత్తులు, సమస్యలు వచ్చినప్పుడు కూడా తన వంతు సాయంగా ప్రజలకు అండగా నిలబడుతున్నాడు.

తాజాగా మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తన అభిమాని గుండె ఆపరేషన్‌ కు కావాల్సిన ఏర్పాట్లు స్వయంగా తానే చేయించే ఆమె ప్రాణాలు కాపాడనున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన రాజనాల వెంటక నాగలక్ష్మీ మెగాస్టార్‌కు వీరాభిమాని. చిరంజీవి అంజనా సేవా సంస్ధకు అధ్యక్షరాలుగా ఉన్న ఆమె మెగాస్టార్ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

అయితే ఇటీవల ఆమె ఆరోగ్యం పాడైంది. తీవ్రమైన గుండెజబ్బుతో ఇబ్బంది పడుతుంది. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రమైంది. దీంతో ఆమెను ఆదుకునేందుకు మెగాస్టార్ స్వయంగా ముందుకు వచ్చారు. ఆమెను హైదరాబాద్‌కు రప్పించి ఓ ప్రముఖ సర్జన్‌తో ఆమెకు శస్త్రచికిత్స చేయిస్తున్నారు. చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో డాక్టర్లు కూడా ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల్లో ఆమెకు  ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.

లాక్‌ డౌన్‌ కారణంగా ప్రస్తుతం తెలుగు సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని  ఆదుకునేందుకు కూడా ముందుకు వచ్చాడు మెగాస్టార్‌. స్వయంగా కోటి రూపాయల సాయం అంధించిన ఆయన సీసీసీ పేరుతో సంస్థను స్థాపించి భారీగా విరాళాలు సేకరిస్తున్నారు.

click me!