మెగాస్టార్ పెద్ద మనసు.. అభిమాని కూతురు పెళ్లికి ఆర్థిక సాయం...

Bukka Sumabala   | Asianet News
Published : Dec 10, 2020, 04:21 PM IST
మెగాస్టార్ పెద్ద మనసు.. అభిమాని కూతురు పెళ్లికి ఆర్థిక సాయం...

సారాంశం

తన అభిమాని కూతురి పెళ్లికి ఆర్థిక సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. వివరాల్లోకి వెడితే..మహబూబాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండి నడుపుతాడు. గత 30 సంవత్సరాల నుంచి ఆయన మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. 

రాష్ట్రస్థాయిలో చిరంజీవి సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడంలో శేఖర్ ముందు వరుసలో ఉంటాడు. శేఖర్‌కి ఇద్దరు కూతుళ్ళు వర్ష, నిఖిత. శేఖర్ పెద్ద కూతురు వర్ష పెళ్లి ఈ నెల డిసెంబర్ 19న పెట్టుకున్నారు. అయితే ఆర్థికంగా ఇబ్బందులో ఉండడంతో ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్.. పెళ్లికి రూ. 1,00,000 ఆర్ధిక సాయం చేశారు. 

ఈ సందర్భంగా మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల సహాయం చేయడం హర్షనీయమని అన్నారు. చిరంజీవిని దేవుడు చల్లగా చూడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

అభిమానులు ఎవరు కష్టాల్లో ఉన్నా సమాచారం ఇవ్వాలని చిరంజీవే  స్వయంగా తమతో చెప్పారని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం రావణస్వామి నాయుడు తెలిపారు. నగదు సహాయం అందుకున్న చిరంజీవి అభిమాని శేఖర్ మాట్లాడుతూ.. రక్త సంబంధీకులు చేయని సాయాన్ని చిరూ చేశారని, ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనిది అని కన్నీటి పర్యంతమయ్యారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?