వైయస్ జగన్ అపాయింట్మెంట్ కోరిన చిరు!

Published : Oct 10, 2019, 11:39 AM IST
వైయస్ జగన్ అపాయింట్మెంట్ కోరిన చిరు!

సారాంశం

ఇంతకూ చిరు ఆ అపాయింట్మెంట్ అడగటానికి కారణం ...ఆయన తాజా చిత్రం సైరా సక్సెస్ గురించి చెప్పాలని, అవకాసం ఉంటే ఓ షో వేసి చూపించాలని తెలుస్తోంది.

 

వైయస్ జగన్ ...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత సినిమా పెద్దలు ఎవరూ ఆయన్ను కలవలేదు. ఆ విషయమై అప్పుడు మీడియాలో భారీ విమర్శలు సైతం వచ్చాయి. మరో ప్రక్క అశ్వనీదత్, దిల్ రాజు లాంటి ప్రముఖులు కలుద్దామనుకున్నా అపాయింట్మమెంట్ దొరకలేదని వినిపించింది.  మరో ప్రక్కన వైసీపీలో ఉన్న ఫృధ్వీ, పోసాని మధ్య ఈ విషయమై విభేధాలు సైతం వచ్చాయి. రాజేంద్రప్రసాద్ సైతం ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ఇవన్నీ ప్రక్కన పెడితే..ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి...జగన్ ని కలవటానికి అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది.

ఇంతకూ చిరు ఆ అపాయింట్మెంట్ అడగటానికి కారణం ...ఆయన తాజా చిత్రం సైరా సక్సెస్ గురించి చెప్పాలని, అవకాసం ఉంటే ఓ షో వేసి చూపించాలని తెలుస్తోంది. అలాగే అదే సమంయలో ముఖ్యమంత్రిగా ఎంపికైనందుకు శుభాకాంక్షలుకూడా చెప్తారట. ఇక సైరా విడుదల సమయంలో స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు జగన్ కు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి కూడా అని తెలుస్తోంది.
 
ఇక ఈ రిక్వెస్ట్ ని ఖచ్చితంగా జగన్ ఆమోదించే అవకాసం ఉందంటున్నారు. ఎందుకంటే చిరంజీవి తో ముఖ్యమంత్రి అయ్యాక జగన్ కలిసింది లేదు. చిరంజీవిని కలవటం ద్వారా మెగా ఫ్యాన్స్ కు, ఓ సామాజిక వర్గానికి సంతోషం కలిగించే అవకాసం ఉంది. అయితే ఇప్పటిదాకా చిరు, జగన్ ల కలయికు ఇంకా  అపాయింట్మెంట్ ఫిక్స్ కాలేదు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?